చెర్వుగట్టులో అగ్నిగుండాలు | - | Sakshi
Sakshi News home page

చెర్వుగట్టులో అగ్నిగుండాలు

Jan 29 2026 6:33 AM | Updated on Jan 29 2026 6:33 AM

చెర్వ

చెర్వుగట్టులో అగ్నిగుండాలు

నార్కట్‌పల్లి : చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం తెల్లవారుజామున అగ్నిగుండాల ఘట్టాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వరశర్మ, సతీష్‌శర్మ, శ్రీకాంత్‌శర్మ, సురేష్‌, సిద్దుశర్మ, నాగయ్యశర్మ, జగదీష్‌శర్మ వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ గరుడ వాహనంపై స్వామి వారితో పాటు ఇరమూస్తి వార్ల ప్రభను అగ్నిగుండం వరకు తీసుకొచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం అగ్నిగుండాలను ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఓం నమః శివాయ అంటూ అగ్నిగుండంలో నడిచి మొక్కు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ అశోక్‌రెడ్డి, ప్రత్యేక అధికారి భాస్కర్‌, ఈఓ మోహన్‌బాబు, ఉత్సవ కమిటీ చైర్మన్‌ వరాల రమేష్‌, సర్పంచ్‌ నేతగాని కృష్ణ, గడుసు శశిదర్‌రెడ్డి, రేగట్టె నవీన్‌రెడ్డి, సీనియర్‌ అసిస్టెంట్‌ ఇంద్రసేనరెడ్డి, ఉప సర్పంచ్‌ జలేందర్‌రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

హుండీ ఆదాయం రూ.6,22,696

బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు స్వామి వారికి సమర్పించిన కానుకల హుండీలను బుధవారం లెక్కించారు. రూ.6,22,696 ఆదాయం సమకూరినట్లు ఈఓ మోహన్‌బాబు తెలిపారు. గత బ్రహ్మోత్సవాల సమయంలో రూ.1,03,365 ఆదాయం రాగా.. ఈ ఏడాది 6,22,696 వచ్చిందని గతేడాది కంటే రూ.5,19,331 ఆదాయం సమకూరిందని వివరించారు.

చెర్వుగట్టులో అగ్నిగుండాలు1
1/2

చెర్వుగట్టులో అగ్నిగుండాలు

చెర్వుగట్టులో అగ్నిగుండాలు2
2/2

చెర్వుగట్టులో అగ్నిగుండాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement