గద్దె పైకి సారలమ్మ
రాజాపేట : మండలంలోని చిన్నమేడారం, చల్లూరు యాదాద్రి మేడారంలో గిరిజనుల ఆరాధ్యదైవం సారలమ్మను బుధవారం గద్దైపె అధిష్టింపజేశారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, పూజారులు గ్రామ సమీపంలోని ఏదులగుట్టపై మూల దేవతలకు పూజలు చేశారు. అనంతరం సారలమ్మను డప్పు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలతో ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. కుంకుమ భరిణె రూపంలో ఉన్న సారలమ్మను వెదురు బొంగును పూజారులు గద్దైపెన ప్రతిష్టించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసి పోయింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి తలనీలాలు, కొబ్బరికాయలు, నిలువెత్తు బెల్లం, కుంకుమ, పసుపు, నూతన వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం పులిగుట్ట నుంచి సమ్మక్క గద్దైపెకి చేరుతుందని పూజారులు తెలిపారు. డీఎస్పీ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో యాదగిరిగుట్ట రూరల్ సీఐ ఎం. శంకర్‌గౌడ్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆరోగ్యశాఖ అధికారులు వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో నుంచి చిన్నమేడారం వరకు ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నారు.
ఫ చిన్నమేడారంలో భక్తుల రద్దీ
గద్దె పైకి సారలమ్మ
గద్దె పైకి సారలమ్మ
గద్దె పైకి సారలమ్మ


