తరలివచ్చిన భక్తజనం
పెన్‌పహాడ్ : మండల పరిధిలోని గాజులమల్కాపురంలో సమ్మక్క–సారలమ్మ జాతర
బుధవారం వైభవంగా ప్రారంభమైంది. గ్రామం నుంచి దేవతామూర్తులను ఊరేగింపుగా గద్దెల పైకి తీసుకొచ్చారు. మహిళలు పెద్దఎత్తున బోనాలు సమర్పించారు. బంగారం(బెల్లం) మొక్కు చెల్లించారు. కొబ్బరికాయలు, గొర్రె, మేక పొట్టేళ్లను, కోళ్లను బలిచ్చారు. గ్రామమంతా భక్తులతో కిటకిటలాడింది. ఎస్‌ఐ గోపికృష్ణ, ఏఎస్‌ఐ రాములు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. నాగుల పుట్టకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివసత్తులు పూనకంతో ఊగిపోయారు. గురువారం రెండు తెలుగు రాష్ట్రాలస్థాయి కోలాటం, డ్యాన్స్ పోటీలను ప్రారంభించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ బండి మధుసూదన్‌రెడ్డి, సర్పంచ్ నాతాల వెంకట్‌రెడ్డి, బండి రామకృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ సొంటి ఆంజనేయులు, వైస్ చైర్మన్ మండాది పాపయ్య, కుందూరు వెంకట్‌రెడ్డి, గుత్తికొండ రాంరెడ్డి, దేవిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, బండి అనిల్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తరలివచ్చిన భక్తజనం


