ఎంఐఎం అనుమతితోనే మేయర్
నల్లగొండ : మన అనుమతి లేనిదే నల్లగొండలో మేయర్ ఎవరు కాలేరని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. నల్లగొండలో ఆదివారం రాత్రి జరిగిన సభలో ఆయన మాట్లాడారు. డబ్బులు ఎవరు ఇచ్చినా తోసుకోవాలని సూచించారు. నల్లగొండలో 9 మంది ఎంఐఎం కార్పొరేటర్లను గెలిపించాలని పిలుపునిచ్చారు. 26 ఎకరాలు భూమి వక్ఫ్ బోర్డ్ భూమి ఉందని దాన్ని కొన్ని అతీతశక్తులు కాజేయలని చూశాయని, ఎంఐఎం ఆ భూములను కాపాడిందన్నారు. అభ్యర్థులు వేరే ముసుగులో మన వారే ఉన్నారని, కానీ వారి నోటికి తాళాలు ఉంటాయన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కోసం ఎంఐఎం పార్టీ ఉందన్నారు. ప్రత్యర్థులు ఓటు కోసం డబ్బులు పంచితే తీసుకుని.. వాటితో బాత్‌రూమ్ మర్మతు చేసుకోవాలని.. ఓటు మాత్రం మజ్లిస్‌కే వేయాలన్నారు. తాము ఇంత తక్కువగా ఉన్నామని అయినా.. తమను చూసి బీజేపీ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. ఈ దేశం భగత్‌సింగ్‌ను కన్నదని.. అంతకు ముందే సుల్తాన్‌ను కూడా కన్నదని పేర్కొన్నారు.
ఫ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ
ఎంఐఎం అనుమతితోనే మేయర్


