జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపిక
రాజాపేట : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జీఎఫ్‌ఐ)జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు రాజాపేట మండలం దూదివెంకటాపురం ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని గుల్లెన ప్రణీత ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయురాలు ఎస్. విజయలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ మధు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో గత నెల జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా తరఫున ప్రణీత పాల్గొని జాతీయస్థాయికి ఎంపికై నట్లు పేర్కొన్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఛత్తీస్‌గడ్‌లో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో ఆమె పాల్గొననున్నట్లు వారు తెలిపారు.
జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపిక


