చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీ

Feb 8 2026 11:15 AM | Updated on Feb 8 2026 11:15 AM

చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీ

చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీ

నల్లగొండ : మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, నగదు, ఇతర విలువైన వస్తువులు అక్రమంగా సరఫరా కాకుండా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రధాన రహదారులు, గ్రామీణ మార్గాలు, పట్టణ పరిధుల్లో వాహనాల తనిఖీలు ముమ్మరంగా చేపట్టాలని, అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని సిబ్బందికి సూచించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే సంబంధిత వ్యక్తులపై, వాహనదారులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో డీఎస్పీ శివరాంరెడ్డి, ఎస్‌ఐ గోపాల్‌రావు, పోలీసులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement