28వ తేదీలోగా సీఎంఆర్ ఇవ్వాలి
నల్లగొండ : మిల్లర్లు ఈనెల 28వ తేదీలోగా సీఎంఆర్ (కష్టం మిల్లింగ్ రైస్)ను చెల్లించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ రైస్ మిల్లర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సీఎంఆర్‌పై సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. 2024–25కు సంబంధించిన సీఎంఆర్ లక్ష్యాలను.. పెండింగ్ లేకుండా గడువులోగా పూర్తి చేయాలన్నారు. 2025–26 యాసంగి సీజన్‌కు మిల్లర్లు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలన్నారు. గన్ని బ్యాగులను కార్పొరేషన్‌కు అప్పగించాలని సూచించారు. సమావేశంలో డీఎస్‌ఓ వెంకటేష్, డీఎం రామ్, నల్లగొండ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణ, శ్రీనివాస్, భద్రాద్రి ఇంద్రారెడ్డి, గౌరు వెంకటేశ్వర్లు, బాబి తదితరులు పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్


