యాదగిరీశుడి సన్నిధిలో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

యాదగిరీశుడి సన్నిధిలో భక్తుల రద్దీ

Feb 2 2026 7:17 AM | Updated on Feb 2 2026 7:17 AM

యాదగిరీశుడి సన్నిధిలో భక్తుల రద్దీ

యాదగిరీశుడి సన్నిధిలో భక్తుల రద్దీ

యాదగిరిగుట్ట: యాదగిరి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సెలవురోజు కావడంతో పాటు మేడారం జాతరకు వెళ్లి తిరుగు ప్రయాణమైన భక్తులు యాదగిరీశుడిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. దీంతో క్యూలైన్లు, ముఖ మండపం, క్యూకాంప్లెక్స్‌ వంటి ప్రాంతాలు భక్తులతో నిండుగా కనిపించాయి. భక్తులు అధికంగా రావడంతో స్వామి వారి ధర్మ దర్శనానికి 3గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. నృసింహస్వామిని 35వేలమందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.45,26,865 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement