ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
గుండాల : పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ మోత్కూరు సెక్షన్ ఆఫీసర్ కె.ఎల్లేష్ సూచించారు. గురువారం గుండాల మండలం వెల్మజాల గ్రామంలో రైతులు పడకంటి నరేందర్, పడకంటి శ్రీను, జోలం పాండు వ్యవసాయ భూమిలో పులి సంచరించినట్లు గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామానికి వచ్చిన ఫారెస్ట్ అధికారులు పాద ముద్రలను పరిశీలించారు. ఇవి పులిపాదముద్రలే అని నిర్ధారించారు. ఈ సందర్భంగా ఎలేష్ మాట్లాడుతూ రైతులు ఎవరూ రాత్రి వేళల్లో ఒంటరిగా వ్యవసాయ బావుల వద్దకు వెళ్ల వద్దన్నారు. పశువులు, గొర్రెలు, మేకలను ఇళ్ల వద్దకు తెచ్చుకోవాలని సూచించారు. ఆయన వెంట ఫారెస్ట్ అధికారి పి.శ్రీనివాస్, సర్పంచ్ కుర్మిళ్ల కవితశ్రీనివాస్, మాజీ సర్పంచ్ దాస ప్రసాద్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఫ ఫారెస్ట్ అధికారుల సూచన


