విధులు సమర్థంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

విధులు సమర్థంగా నిర్వహించాలి

Feb 3 2026 7:54 AM | Updated on Feb 3 2026 7:54 AM

విధులు సమర్థంగా నిర్వహించాలి

విధులు సమర్థంగా నిర్వహించాలి

నీటి గణన పూర్తి చేయాలి

ఇరిగేషన్‌ వాటర్‌ బాడీస్‌ గణనను 7వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం నల్లగొండలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో 7వ చిన్న నీటిపారుదల గణన, 2వ జలవనరుల గణనపై ఆయన సమీక్షించి మాట్లాడారు. మైనర్‌ ఇరిగేషన్‌ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు, మేజర్‌ ఇరిగేషన్‌ కింద ఉన్న నీటి వనరులు, బోర్లు, బావులకు సంబంధించిన వివరాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేయాలని అధికారులకు సూచించారు. భవిష్యత్‌లో సాగునీటి ప్రణాళికలు, నీటి సంరక్షణ చర్యలు చేపట్టేందుకు ఈ గణన బలమైన ఆధారంగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

నల్లగొండ : మున్సిపల్‌ ఎన్నికల విధులను పీఓ, ఏపీఓలు సమర్థంగా నిర్వర్తించాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి చంద్రశేఖర్‌ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌ ఉదయాదిత్య భవన్‌లో పీఓ, ఏపీఓలకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రంలో ఇచ్చే మెటీరియల్‌, బ్యాలెట్‌ బాక్స్‌ల సీలింగ్‌, ప్రిసైడింగ్‌ అధికారుల డైరీ, బ్యాలెట్‌ పేపర్‌ అకౌంటు, ఏజెంట్ల సమక్షంలోనే బ్యాలెట్‌ బాక్సులను తెరవడం వంటి అంశాలు వివరించారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్‌ శాతాన్ని టీ పోల్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. మీడియా ప్రతినిధులకు పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఎన్నికల జిల్లా పరిశీలకులు జి.రమేష్‌, గృహ నిర్మాణ పీడీ రాజ్‌కుమార్‌, డీఈఓ భిక్షపతి, ట్రైనింగ్‌ నోడల్‌ అధికారి, చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకుడు ద్వారాక్‌, మాస్టర్‌ ట్రైనర్లు పాల్గొన్నారు.

కలెక్టర్‌ చంద్రశేఖర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement