విద్యుత్ స్టోర్ ఎదుట కాంట్రాక్టర్ల ధర్నా
నల్లగొండ : వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు రైతులు ఏడాది క్రితం డీడీలు కట్టినా మెటీరియల్ ఇవ్వడం లేదంటూ విద్యుత్ కాంట్రాక్టర్లు సోమవారం నల్లగొండలోని విద్యుత్ స్టోర్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించి వెంటనే కనెక్షన్లు ఇవ్వాలని చెబుతున్నా.. మెటీరియల్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. స్టోర్ అధికారులు రైతులకు సంబంధించిన మెటీరియల్‌కు కాకుండా.. ఇతర పనులకు సామగ్రి ఇస్తున్నారని మండిపడ్డారు. అధికారులు స్పంచింది వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల సామగ్రి వెంటనే ఇచ్చేలా చూడాలన్నారు. కార్యక్రమంలో కాంట్రాక్టర్లు రవిచంద్ర, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.


