డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ అందిస్తాం
ఫ టీజీఎస్‌పీడీసీఎల్ శివాజీ
నల్లగొండ : వేసవిలో డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేస్తామని తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్‌పీడీసీఎల్) డైరెక్టర్ శివాజీ అన్నారు. ఆయన మంగళవారం నల్లగొండలోని ఎస్‌ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్‌కు ఎలాంటి కొరత లేదన్నారు. ఈ నెల చివరి నాటికి 7 సబ్‌స్టేషన్ల అందుబాటులోకి రాబోతున్నాయన్నారు. పరికరాల కొరత ఉన్నట్లుగా కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అలాంటి వారి మాటల్లో వాస్తవం లేదన్నారు. 450 కిలోమీటర్ల వైర్ అందుబాటులో ఉండటంతో పాటు డీపీఆర్‌లు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. వేసవిలో నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు ఎలాంటి కోతలు లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు పక్కా ప్రణాళికతో విద్యుత్ శాఖ ముందుకు పోతుందన్నారు. సమావేశంలో ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, డీఈటీ రాజునాయక్, డీఈ ప్రసాద్, స్టోర్ ఏడీ శంకరయ్య, పాల్గొన్నారు.
ఎంజీయూలో
ముగిసిన వర్క్‌షాప్
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో బీటెక్ 8వ సెమిస్టర్, ఎంసీఏ 4వ సెమిస్టర్ విద్యార్థులకు రెండు రోజుల పాటు నిర్వహించిన వర్క్‌షాప్ మంగళవారం ముగిసింది. ఈ కార్యక్రమం ద్వారా వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్, యూజర్ ఇంటర్ ఫేస్ టూ ల్స్, సైడ్ డెవలప్మెంట్ టూల్స్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ వర్క్‌షాప్ ద్వారా విద్యార్థులు స్వయంగా పరీక్షించి, ప్రత్యక్ష అనుభవాన్ని పొందడం సాధ్యమవుతుందని సీ ఎస్సీ విభాగం అధిపతి ఎం.జయంతి తెలి పారు. కార్యక్రమంలో సీవీఎస్సార్ ఇంజనీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఎం.సాగర్, కోఆర్డినేటర్ జ్యోతిరాణి పాల్గొన్నారు.
నిజాయితీ పరులను ఎన్నుకోండి : జూలకంటి
మిర్యాలగూడ : మున్సిపాలిటీలో ఎన్నికల్లో నిజాయితీ పరులను, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తులను గెలిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. మంగళవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ధనబలంతో వచ్చే అవకాశవాదులను, అవినీతిపరులు ప్రజలను మభ్యపెట్టి ప్రలోభాల ఆశ చూపి ఓట్లు పదవులు పొందేందుకు ముందుకు వస్తున్నారని.. అలాంటి వారికి ఓటుతో సమాధానం చెప్పాలన్నారు. రెండేండ్ల కాలంలో పట్టణంలో అభివృద్ధి జరగలేదని, కేవలం కాలయాపన చేస్తూ కాలం గడిపారని అన్నారు. తమ హయాంలో రోడ్లు, మంచినీటి వ్యవస్థ, డ్రెనేజీ పనులు చురుకుగా సాగాయని.. ఇప్పుడు ఏ అభివృద్ధీ జరగలేదని విమర్శించారు.
డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ అందిస్తాం


