బీజేపీ అభ్యర్థుల ఖరారు గందరగోళం!
అది టైపింగ్ ఎర్రర్ మాత్రమే
సాక్షి ప్రతినిఽధి, నల్లగొండ : కార్పొరేషన్‌లో పలు డివిజన్ల అభ్యర్థుల ఖరారులో గందరగోళం నెలకొంది. నామినేషన్లు వేయని పలువురి పేర్లను పార్టీ తరఫున పోటీలో ఉంచుతున్నట్లు బీజేపీ శనివారం రాత్రి ప్రకటించింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తరువాత విషయాన్ని గ్రహించిన బీజేపీ నేతలు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. 4వ డివిజన్ (ఎస్సీ మహిళ) బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా కత్తుల నాగేశ్వరి, 20వ డివిజన్ (జనరల్) కార్పొరేటర్ అభ్యర్థిగా నాంపల్లి అయ్యప్ప పేర్లను శనివరాం రాత్రి ప్రకటించారు. అయితే వారు నామినేషన్లు దాఖలు చేయలేదని తెలిసింది. దీంతో నాలుక కరచుకొని దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇక ఆదివారం 4వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థిగా అన్నపూరి మౌనికను పోటీలో ఉంచుతున్నట్లు బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి ప్రకటించారు. 20వ డివిజన్ అభ్యర్థి విషయాన్ని ప్రస్తుతం పెండింగ్‌లో పెట్టారు. ఇక 34వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా దోనాల నాగార్జునరెడ్డి పేరును ప్రకటించారు. అయితే ఆదివారం మార్పు చేసి ఆర్.వెంకటేశ్వర్లును అభ్యర్థిగా ప్రకటించారు. మరోవైపు సిట్టింగ్ కౌన్సిలర్లలో బండారు ప్రసాద్ పోటీ చేయనని వదిలేశారు. మరో సిట్టింగ్ కౌన్సిలర్, 35వ డివిజన్‌కు చెందిన గుర్రం ధనలక్ష్మి బీఆర్‌ఎస్‌కు వెళ్లిపోయారు. అక్కడ ఆమెకు టికెట్ ఇచ్చారు. 37వ డివిజన్‌కు చెందిన బొజ్జ నాగరాజు 36వ డివిజన్ కావాలని పట్టుబట్టారు. అయితే ఆయనకు టికెట్ ఇచ్చేందుకు పార్టీ ససేమిరా అంటున్నట్లు తెలిసింది.
ఫ నామినేషన్లు వేయని
పలువురి పేర్లు ప్రకటన
నల్లగొండ కార్పొరేషన్‌లో 4వ, 20వ, 34వ డివిజన్ల అభ్యర్థుల పేర్లు టైప్ చేసేప్పుడు తప్పులు దొర్లాయి. అది టైపింగ్ ఎర్రర్ మాత్రమే. అభ్యర్థుల మార్పు కాదు. అన్ని కులాల వారికి అవకాశం కల్పిస్తున్నాం. సోమవారం మిగతా అన్ని డివిజన్లకు అభ్యర్థులను ప్రకటిస్తాం. బి–ఫారాలు ఇచ్చేస్తాం. స్టార్ క్యాంపెయినర్లు రాబోతున్నారు. పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తాం.
– బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి


