సాగర్‌ కాల్వలో కొనసాగుతున్న గాలింపు | - | Sakshi
Sakshi News home page

సాగర్‌ కాల్వలో కొనసాగుతున్న గాలింపు

Feb 10 2026 8:05 AM | Updated on Feb 10 2026 8:05 AM

సాగర్‌ కాల్వలో కొనసాగుతున్న గాలింపు

సాగర్‌ కాల్వలో కొనసాగుతున్న గాలింపు

నిడమనూరు : మండలంలోని ముకుందాపురం వద్ద సాగర్‌ కాల్వలోకి కారు దూసుకెళ్లడంతో గల్లంతైన తల్లం పుల్లయ్య ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అతడి ఆచూకీ కోసం సోమవారం సాయంత్రం వరకు రెవెన్యూ అధికారులు, నిడమనూరు పోలీసులు, పుల్లయ్య కుటుంబ సభ్యులు విస్తృతంగా గాలించారు. ప్రత్యేక బోటులో ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఘటన జరిగిన స్థలం నుంచి త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి రిజర్వాయర్‌ వరకు ఎడమ కాల్వ తూముల వద్ద వెతుకుతున్నారు. గాలింపు చర్యలను నిడమనూరు తహసీల్దార్‌ జంగాల కృష్ణయ్య, హాలియా సీఐ సతీష్‌రెడ్డి, ఎస్‌ఐ ఉప్పు సురేష్‌, ముకుందాపురం సర్పంచ్‌ సలికంటి పద్మాసత్యం పర్యవేక్షించారు.

లభ్యంకాని పుల్లయ్య ఆచూకీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement