నిరాశపర్చిన నిర్మలమ్మ!
నల్లగొండ : కేంద్ర బడ్జెట్‌లో ఈసారి జిల్లాకు నిరాశే మిగిలింది. ఎలాంటి కేటాయింపులు దక్కలేదు. ముఖ్యమైన ప్రతిపాదనలు, డిమాండ్లలోనూ దేనికీ నిధులు విదిల్చలేదు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా బడ్జెట్‌ను ఉందని, సామాన్య, మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం చేకూర్చే అంశాలు ఏ ఒక్కటీ లేవని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఉపాధిహామీ పథకానికి నిధులు పెంచడం, అన్ని జిల్లా కేంద్రాల్లో బాలికల వసతిగృహాలు ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం ఆయా వర్గాలకు ఊరటనిచ్చింది.
రైతులకు ప్రయోజనం చేకూర్చే ప్రత్యేక పథకాలు లేవి బడ్జెట్‌లో ప్రకటించలేదు. గతంలో మాదిరిగానే పీఎం కిసాన్ సమ్మాన్‌నిధి కొనసాగనుంది. కిసాన్ సన్మాన్ నిధి కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వేల మంది రైతులకు నిరీక్షణే మిగిలింది. పెట్టుబడి సాయం ఎప్పుడిస్తారనే విషయం ప్రస్తావనే లేకపోవడంతో వారిని నిరాశపరిచింది. ఇక ఆయిల్‌పామ్ సాగుకు గత ఆర్థిక సంవత్సరం ప్రత్యేక నిధులు కేటాయించినా.. ఈసారి ఆ ఊసే లేదు.
జిల్లాలో చేపట్టదలిచిన పెద్ద ప్రాజెక్టుల ప్రస్తావనే లేదు. హైదరాబాద్ జంక్షన్‌గా మూడు హైస్పీడ్ కారిడార్లు హైదరాబాద్ మీదుగా వెళ్లడం విశేషం.
కేంద్ర బడ్జెట్ తెలంగాణ ప్రజలను నిరాశ పరిచింది. తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు లేవు. ఆదాయపు పన్నులో ఎలాంటి మార్పులు లేవు. ఇది సామాన్య, మధ్య తరగతి ప్రజలకు వ్యతిరేక బడ్జెట్. చిన్న తరహా పరిశ్రమలకు ఎలాంటి ప్రోత్సాహాకాలు లేవు. జాతీయ ఫ్లోరైడ్ పరిశోధన సంస్థకు ఎలాంటి కేటాయింపులు చేయలేదు.
– పున్న కై లాష్, డీసీసీ అధ్యక్షుడు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వృద్ధులను నిరాశ పరిచింది. వృద్ధులకు రైలు, బస్ ప్రయాణాల్లో పూర్తి రవాణా రాయితీ కల్పించి ఉచితంగా వెళ్లేలా ప్రధాని జీఓ జారీ చేయాలి. వృద్ధులను గౌరవించి వారు దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించేలా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి. బస ఏర్పాటు చేయాలి.
– సముద్రాల మల్లికార్జున్, జిల్లా సీనియర్
సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పరిమాణం పెరిగినప్పటికీ పేదలె, మధ్యతరగతి ప్రజలకు తగిన కేటాయింపులు చేయలేదు. బడ్జెట్‌లో వ్యవసాయ రంగం, గ్రామీణ ఉపాధి హామీ పథకాలకు తగినన్ని నిధులు కేటాయించలేదు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు నిధులిచ్చి.. ప్రతిపక్ష పార్టీలు పాలించే రాష్ట్రాలను విస్మరించారు. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు ఏవిధమైన చర్యలు తీసుకోలేదు.
– తుమ్మల వీరారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి
గ్రామ పంచాయతీలకు 16వ ఆర్థిక సంఘం నిధులు రానున్నాయి. జనాభా ప్రాతిపదికన నిధులు విడుదల చేస్తారు. త్వరలో మున్సిపల్ పాలకవర్గాలు కూడా ఏర్పాటు కానుండటం, ఆ తరువాత పరిషత్ ఎన్నికలు కూడా జరగనుడంతో వాటికి కూడా ఆర్థిక సంఘం నిధులు రానున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్ ఆదాయ పన్ను(ఐటీ) చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించలేదు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఏఐ డేటా సెంటర్లు, క్లీన్ ఎనర్జీపై దృష్టి పెట్టింది. సేవారంగ వృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. మూడు హైస్పీడ్ కారిడార్లు హైదరాబాద్ మీదుగా వెళ్లడం విశేషం. రాష్ట్రాల్లో మరిన్ని డేటా సెంటర్లు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. చిన్న పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. 5 లక్షల కంటే ఎక్కువ ఉన్న పట్టణాలు, నగరాల అభివృద్ధికి కేంద్ర నిధులు అందనున్నాయి.
– ముని స్వామి, అసోసియేట్ ప్రొఫెసర్,
ఎకనామిక్స్, ఎన్జీ కాలేజీ
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 వార్షిక బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది. రాష్ట్రం నుంచి కేంద్రానికి వేల కోట్ల రూపాయల పన్నుల రూపంలో వెళ్తున్నా.. తిరిగి నిధులు కేటాయించడంలో కేంద్రం మరోసారి తెలంగాణపై వివక్ష చూపింది. విభజన హామీలైన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఊసే ఎత్తలేదు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంటలకు కనీస మద్దతు ధర చట్టంపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఎరువుల సబ్సిడీలో కోత విధించి నల్లగొండ వంటి వ్యవసాయ ఆధారిత జిల్లాల రైతులపై పెనుభారం మోపింది. ఇది పూర్తిగా కార్పొరేట్ అనుకూల బడ్జెట్.
– నెల్లికంటి సత్యం, ఎమ్మెల్సీ
కేంద్ర బడ్జెట్‌పై జిల్లా ప్రజల పెదవి విరుపు
ఫ కేటాయింపుల్లో సామాన్యులకు దక్కని ఊరట
ఫ కొత్త పథకాలు లేవు.. పాతవే కొనసాగింపు
ఫ వ్యవసాయ రంగానికి దక్కని ప్రాధాన్యం
ఫ ఎంఎస్‌ఎంఈలకు గ్రోత్ ఫండ్,
ఉపాధిహామీకి నిధుల పెంపుతో కాస్త మేలు
నిరాశపర్చిన నిర్మలమ్మ!
నిరాశపర్చిన నిర్మలమ్మ!
నిరాశపర్చిన నిర్మలమ్మ!
నిరాశపర్చిన నిర్మలమ్మ!


