ఓట్ల లెక్కింపునకు అనువైన కేంద్రాన్ని చూడాలి | - | Sakshi
Sakshi News home page

ఓట్ల లెక్కింపునకు అనువైన కేంద్రాన్ని చూడాలి

Jan 31 2026 10:50 AM | Updated on Jan 31 2026 10:50 AM

ఓట్ల లెక్కింపునకు అనువైన కేంద్రాన్ని చూడాలి

ఓట్ల లెక్కింపునకు అనువైన కేంద్రాన్ని చూడాలి

నల్లగొండ : మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అనువైన కేంద్రాన్ని చూడాలని కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అయన నల్లగొండ సమీపంలోని ఆర్జాలబావి వద్ద ఉన్న ఎస్‌డబ్ల్యూసీ గోదామును పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో ఎన్నికలు నిర్వహించనున్న 6 మున్సిపాలిటీలు, నల్లగొండ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు సంబంధించి ప్రతి చోట ఒక కౌంటింగ్‌ హాల్‌తో పాటు, స్ట్రాంగ్‌ రూమ్‌, సీలింగ్‌ రూమ్‌ తదితర సౌకర్యాలు ఉండాలన్నారు. నల్లగొండలో ఆర్జాలబావి ఎస్‌డబ్ల్యూసీ గోదాంతో పాటు, ఇంకా ఏవైనా అనువైన భవనాల్లో ఓట్ల లెక్కింపునకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని నల్లగొండ ఆర్డీఓ అశోక్‌రెడ్డిని ఆదేశించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌, ఎస్‌డబ్ల్యూసీ రీజనల్‌ మేనేజర్‌ వీరమల్లు, మేనేజర్‌ మురళి, మున్సిపల్‌ కమిషనర్‌ శరత్‌చంద్ర, తహసీల్దార్‌ పరశురాం పాల్గొన్నారు.

కంట్రోల్‌ రూమ్‌ సిబ్బంది

అప్రమత్తంగా ఉండాలి

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన కంట్రోల్‌ రూమ్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. శుక్రవారం కంట్రోల్‌ రూమ్‌ను ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. ఫిర్యాదులను రిజిస్టర్‌లో నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. సమస్యను సంబంధిత నోడల్‌ అధికారులు, ప్రత్యేక అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా యచూడాలన్నారు. అనంతరం ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులు, టోల్‌ ఫ్రీ నంబర్‌కు (18004251442) వచ్చిన ఫిర్యాదులు, వాట్సప్‌ నంబర్‌కు (6305951279) వచ్చిన ఫిర్యాదులను రిజిస్టర్‌లో తనిఖీ చేశారు.

ఫ కలెక్టర్‌ చంద్రశేఖర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement