పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించాలి

Feb 10 2026 8:04 AM | Updated on Feb 10 2026 8:04 AM

పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించాలి

పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించాలి

నల్లగొండ : మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి చంద్రశేఖర్‌ అధికారులను ఆదేశించారు. పోలింగ్‌ సన్నద్ధతపై సోమవారం సాయంత్రం ఆయన అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, మున్సిపల్‌ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి మాట్లాడారు. ఎన్నికల ప్రచారం ముగిసినందున ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌బీ, బీఎస్‌టీ బృందాలు చురుకుగా పనిచేయాలన్నారు. బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించకుండా చూడాలని, డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లో పోలింగ్‌ మెటీరియల్‌ చెక్‌ లిస్ట్‌ ప్రకారం సిబ్బందికి అందించాలని సూచించారు. పీఓలు పోలింగ్‌ మెటీరియల్‌ను జాగ్రత్తగా గమనించాలని, మున్సిపల్‌ కమిషనర్లు కమ్యునికేషన్‌ ప్లాన్‌ రూపొందించాలని చెప్పారు. బ్యాలెట్‌ పేపర్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. మున్సిపల్‌ ఎన్నికల జిల్లా సాదారణ పరిశీలకులు జి. రమేష్‌ మాట్లాడుతూ పోలింగ్‌ మెటీరియల్‌ పూర్తిగా తనిఖీ చేసుకొని సిబ్బందికి ఇవ్వాలని తెలిపారు. 90 శాతం ఓటింగ్‌ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌, ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, మిర్యాలగూడ సబ్‌ కలెక్టర్‌ నారాయణ్‌ అమిత్‌ పాల్గొన్నారు.

పోలింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌

మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ సిబ్బంది చివరి ర్యాండమైజేషన్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌ పర్యవేక్షణలో కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో మున్సిపల్‌ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు జి.రమేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. పోలింగ్‌ నిర్వహణకు గాను మొత్తం 475 పోలింగ్‌ కేంద్రాలలో 20 శాతం రిజర్వ్‌ కలుపుకొని సిబ్బందిని కేటాయిస్తూ ర్యాండమైజేషన్‌ చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. 571 మంది పీఓలు, 571 మంది ఏపీఓలు, 1,713 మంది ఓపీఓలు మొత్తం 2,855 మందికి ఈ ర్యాండమైజేషన్‌లో పోలింగ్‌ విధులను కేటాయించామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌, ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ చంద్రశేఖర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement