చెర్వుగట్టులో ముగిసిన బ్రహ్మోత్సవాలు
నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు శుక్రవారం ఏకాదశ రుద్రాభిషేకం, మహానివేదన, నీరాజన మంత్ర పుష్పం తదితర పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ముగింపు సంద్భంగా గజవాహనముపై స్వామి, అమ్మవార్ల ఉంచి చెర్వుగట్టు, ఎల్లారెడ్డిగూడెం గ్రామాల్లో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్, ఈఓ మోహన్‌బాబు, సీనియర్ అసిస్టెంట్ ఇంద్రసేనారెడ్డి, దేవాలయ ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, ఉప ప్రధానార్చకుడు ఉప్పల సతీష్ శర్మ, మామిళ్లపల్లి రాంబాబు శర్మ, మామిళ్లపల్లి సురేష్‌శర్మ, రెగిచేడు శ్రీకాంత్‌శర్మ, మామిళ్లపల్లి నాగయ్యశర్మ, పోతులపాటి జగదీష్‌శర్మ, పడింతులు రవితేజ, రాము, పోతులపాటి శశిశర్మ, పవన్ శర్మ, ఉత్సవ కమిటీ చైర్మన్ వరాల రమేష్, సర్పంచ్ నేతగాని కృష్ణ, రేగట్టె నవీన్‌రెడ్డి, రేగట్టె నర్సిరెడ్డి, గడుసు శశిదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


