మున్సిపల్ బరిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
మిర్యాలగూడ:
రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే దివంగత మల్లు స్వరాజ్యం మనవరాలు మల్లు మధులత మిర్యాలగూడ మున్సిపాలిటీలో 17వ వార్డు నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేస్తోంది. మల్లు స్వరాజ్యం కుమారుడు మల్లు గౌతమ్‌రెడ్డి కోడలు అయిన మధులత సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలిపెట్టి ప్రజా సేవ చేసేందుకు ఎన్నికల బరిలో నిలబడ్డారు. తన అమ్మమ్మ మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆమె తెలిపారు. రాజకీయ పార్టీలు సైతం యువతకు తగిన ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించాలని, తనను గెలిపిస్తే 17వ వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తానని ఆమె చెప్పారు.


