వార్డు సమస్యలను గుర్తించాలి
సూర్యాపేట టౌన్ : మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఆయా వార్డులలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీలివ్వాలని సూర్యాపేట సామాజిక అధ్యయన వేదిక నాయకులు కోరారు. వేదిక రూపొందించిన కరపత్రాన్ని సోమవారం జిల్లా కేంద్రంలోని జగ్జీవన్ రామ్ విగ్రహం ఎదుట వారు ఆవిష్కరించారు. అవినీతి, అక్రమాలను రూపుమాపడానికి, సమాజ మార్పు కోసం పాటుపడాలని సూచించారు. ప్రజలు ఈ కరపత్రాన్ని వార్డు నుంచి పోటీ చేసే వారికి అందించి అందుకు సంబంధించిన హామీలు పొందాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎల్.భద్రయ్య, కరీం, సుభాని, ఆవుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


