అచ్చం వైఎస్సార్ లాగే..
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఐనాల శ్రీనివాస్ సోమవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వేషధారణతో జిల్లా కేంద్రంలోని పలు వార్డులలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించాడు. ఆయన అచ్చం వైఎస్సార్ హావ భావాలు ప్రదర్శిస్తుండడంతో జూనియర్ వైఎస్సార్‌గా పేరుపొందాడు. రెండు రాష్ట్రాల్లో ఎక్కడ కాంగ్రెస్ మీటింగ్‌లు, సభలు జరిగినా ఆయన పాల్గొంటూ ఉంటాడు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలలో సూర్యాపేట పట్టణంలోని పలు వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తూ వైఎస్సార్ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు.


