16వ డివిజన్‌ అభివృద్ధి బాధ్యత నాదే.. | - | Sakshi
Sakshi News home page

16వ డివిజన్‌ అభివృద్ధి బాధ్యత నాదే..

Feb 10 2026 8:04 AM | Updated on Feb 10 2026 8:04 AM

16వ డివిజన్‌ అభివృద్ధి బాధ్యత నాదే..

16వ డివిజన్‌ అభివృద్ధి బాధ్యత నాదే..

నల్లగొండ టూటౌన్‌ : మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో 16వ డివిజన్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి పెరిక స్వాతిని భారీ మెజార్టీతో గెలిపించాలని డివిజన్‌ అభివృద్ధి బాధ్యత నాది అని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. 16వ డివిజన్‌లో నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడుతూ కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపుతోనే డివిజన్‌లోని అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ప్రభుత్వం నుంచి వందల కోట్లు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. ప్రజల సమస్యలపై అవగాహన ఉండి, ప్రజల మధ్య ఉన్న అభ్యర్థి గెలుపుతోనే డివిజన్‌ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ మందడి శ్రీనివాస్‌రెడ్డి, వినాయకరాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement