162 వార్డులు..1,796 నామినేషన్లు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ కార్పొరేషన్, 6 మున్సిపాలిటీల్లో కార్పొరేటర్, కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు 1,796 మంది నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు శుక్రవారం పెద్దసంఖ్యలో నామినేషన్లు వచ్చాయి. కొన్ని చోట్ల ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఆశావహులంతా నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు చాలా మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉండేందుకు నామినేషన్లు వేశారు. విచిత్రంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి భార్య, ఇద్దరుకుమారులు మూరు వార్డుల్లో కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం.
బీఫాం లేకుంటే స్వతంత్య్ర అభ్యర్థులుగానే..
మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఈ నెల 28వ తేదీన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల దాఖలుకు మూడు రోజులు అవకాశం ఇవ్వడంతో ఆశావహ అభ్యర్థులంతా పోటీలో ఉండేందుకు నామినేషన్లను దాఖలు చేశారు. పార్టీ ఎవరికి బీఫాం ఇస్తే వారు పార్టీ అభ్యర్థులుగా బరిలో ఉండనున్నారు. పార్టీ బీఫాం లేకుండా పోటీ ఉండేవారిని స్వతంత్య్ర అభ్యర్థులుగా పరిగణనలోకి తీసుకుంటారు. చాలా చోట్ల శుక్రవారం కూడా ప్రధాన పార్టీలు అభ్యర్థిత్వాలను ఖరారు చేయకపోవడంతో కొందరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని పార్టీలు చివరి నిమిషంలో అభ్యర్థిత్వం ఖరారు చేయడంతో నోడ్యూస్ సర్టిఫికెట్లు, ఇతర పత్రాల కోసం ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ తదితర మున్సిపాలిటీల్లో నామినేషన్ల ముగింపు సమయమైన సాయంత్రం 5 గంటలలోపు నామినేషన్ కేంద్రాల్లోకి చేరుకున్న వారు లైన్లలో ఉండాల్సి వచ్చింది.
మొదటి రెండు రోజుల్లో 607 నామినేషన్లు
జిల్లాలో నల్లగొండ కార్పొరేషన్‌తో పాటు మిర్యాలగూడ, దేవరకొండ, హాలియా, నందికొండ, చండూరు, చిట్యాల మున్సిపాలిటీల్లో ఈ మూడు రోజుల్లో మొత్తంగా 1796 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రోజు మందకొడిగా వచ్చినప్పటికి రెండో నుంచి ఊపందుకున్నాయి. మొదటి రెండు రోజుల్లో 607 నామినేషన్లు రాగా, చివరి రోజైన శుక్రవారం 1,189 నామినేషన్లు దాఖలయ్యాయి.
పన్నుల రూపంలో భారీగా వచ్చిన ఆదాయం
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇంటి పన్ను, కుళాయి, ఇతర పన్నుల రూపంలో మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున ఆదాయం సమకూరింది. పన్నులు క్లీయర్ చేస్తేనే ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత ఉంటుంది. దీంతో పోటీచేసే అభ్యర్థులంతా పన్నులు చెల్లించి నోడ్యూస్ సర్టిఫికెట్లు తీసుకున్నారు. ఇలా ఆస్తి పన్నులు, కుళాయి పన్నుల రూపంలో.. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో రూ.12.89 లక్షల ఆదాయం సమకూరింది. దేవరకొండలో రూ.10.90 లక్షలు, హాలియాలో రూ.1.74, మిర్యాలగూడలో రూ.18.52 లక్షలు, చండూరులో రూ.5.30 లక్షలు, చిట్యాలలో రూ.6లక్షలు.. మొత్తంగా రూ.55.35 లక్షల ఆదాయం సమకూరింది. అయితే నందికొండ మున్సిపాలిటీలో నివాసలు అన్నీ నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్వార్టర్లు కావడంతో పన్నులు లేవు.
నల్లగొండలో నామినేషన్ దాఖలు చేస్తున్న
కాంగ్రెస్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి
నామినేషన్ వేస్తున్న బీఆర్‌ఎస్ అభ్యర్థి
చకిలం వసంత అనిల్‌కుమార్
నామినేషన్ల వివరాలు ఇలా..
మున్సిపాలిటీ వార్డులు నామినేషన్ల
సంఖ్య
నల్లగొండ కార్పొరేషన్ 48 582
మిర్యాలగూడ 48 507
దేవరకొండ 20 254
హాలియా 12 135
చండూరు 10 117
చిట్యాల 12 106
నందికొండ 12 95
మొత్తం 162 1,796
కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ముగిసిన నామినేషన్ల స్వీకరణ
ఫ చివరి రోజు 1,189 నామినేషన్లు దాఖలు
ఫ చాలా చోట్ల అభ్యర్థులను ప్రకటించని పార్టీలు
ఫ పన్నుల రూపంలో రూ.55.35 లక్షలు చెల్లించిన అభ్యర్థులు
162 వార్డులు..1,796 నామినేషన్లు


