కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌కు పట్టం కట్టండి
నల్లగొండ : నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన నల్లగొండలోని 14, 15, 16, 17, 3 డివిజన్లలో నిర్వహించిన రోడ్డుషోలో మాట్లాడారు. చేయి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్‌కు పట్టం కడితే.. నల్లగొండ అభివృద్ధి బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాలన్ని పేదలకు అందించడమే నా ధ్యేయమన్నారు. నల్లగొండలో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పూర్తి చేయడంతో పాటు 24 గంటలు తాగునీరు అందించేందుకు పనులు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే హైదరాబాద్ తరహాలో స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతానని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రతి వార్డులో అంగన్‌వాడీ భవనాలు నిర్మించే బాధ్యత తీసుకుంటున్నానని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బొట్టుగూడ తరహాలో అబివృద్ధి చేసి పేదలకు నాణ్యమైన విద్య అందిస్తామన్నారు. అన్ని రంగాల్లో అబివృదిద్ధ జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ హఫీజ్‌ఖాన్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, పాశం రాంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, బొజ్జ శంకర్, పెరిక నాగరాజు, అశ్విని పాల్గొన్నారు.
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి


