కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించండి | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించండి

Feb 6 2026 8:35 AM | Updated on Feb 6 2026 8:35 AM

కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించండి

కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించండి

డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్‌నేత

చండూరు : మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని డీసీసీ అధ్యక్షుడు పున్నాౖకైలాష్‌నేత కోరారు. చండూరులో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చండూర్‌ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి చైర్మన్‌ అయితేనే మున్సిపాలిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఇప్పటికే రూ. చండూరు మున్సిపాలిటీలో రూ.30 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని, మరో రూ.15 కోట్ల అభివృద్ధి పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. మునుగోడు అభివృద్ధి కేవలం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితోనే సాధ్యమవుతుందన్నారు. పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్‌ చేసింది శూన్యమన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్‌ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. చండూరు మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఓటర్లను ఓటు అభ్యర్థించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పట్టణాధ్యక్షుడు అనంత చంద్రశేఖర్‌, కోడి శ్రీనివాసులు, బూతరాజు ఆంజనేయులు, మల్లేష్‌, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement