సమ్మక్క–సారలమ్మకు పూజలు చేస్తున్న భక్తులు
పెద్దవూర : మండలంలోని పొట్టిచల్మ ఎక్స్ రోడ్డు వద్ద కృష్ణానది సమీపంలో వనదేవతలైన సమ్మక్క–సారలమ్మ జాతర బుధవారం వేకువ జామున ప్రారంభమైంది. ఏటా ఈ జాతరను ఆలయ ప్రధాన పూజారులు గుంజ అంజమ్మ, గుంజ కృష్ణంరాజు, నాగపురి లక్క ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటారు. తొలి రోజు సమీప గ్రామాల ప్రజలు వనదేవతలకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు.
సమ్మక్క–సారలమ్మను, గద్దెల సమీపంలోని పుట్టను దర్శించుకుని మొక్కులను తీర్చుకున్నారు.


