కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్
నల్లగొండ : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సిబ్బంది ర్యాండమైజేషన్‌ను శుక్రవారం కలెక్టర్, ఎన్నికల అధికారి చంద్రశేఖర్ నల్లగొండలోని తన చాంబర్‌లో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్, నందికొండ, చండూరు, చిట్యాల, దేవరకొండ, హాలియా, మిర్యాలగూడ మున్సిపాలిటీలలోని 162 వార్డులకు, 475 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 20 శాతం రిజర్వ్‌తో కలుపుకొని 270 మంది కౌంటింగ్ సిబ్బంది, 540 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు మొత్తం 810 మంది సిబ్బందికి ర్యాండమెంజేషన్ నిర్వహించినట్లు తెలిపారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో 56 కౌంటింగ్ టేబుళ్లు, 16 ఆర్‌ఓ టేబుళ్లు మొత్తం 72 టేబుళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో వార్డులు, ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా కౌంటింగ్, ఆర్‌ఓ టేబుళ్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకుడు జి.రమేష్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఈఓ భిక్షపతి, ఈడీఎం దుర్గారావు, కలెక్టరేట్ ఏఓ మోతిలాల్, ఎన్నికల డీటీ విజయ్ పాల్గొన్నారు.
పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి
నల్లగొండ : మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా మద్యం, డబ్బు, ప్రలోబాలకు గురిచేసే సామగ్రిపై ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలు నిఘా ఉంచాలన్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దులో చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ఎస్పీ శరత్‌చంద్ర పవార్ మాట్లాడుతూ సమస్యత్మాక ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేస్తామన్నారు. 47 రూట్ మొబైల్స్ ఏర్పాటు చేశామని.. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామని తెలిపారు. సమావేవంలో ఎన్నికల సాధారణ పరిశీలకుడు రమేష్, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.


