సెల్‌ఫోన్‌కు అనుమతి లేదు
భువనగిరిటౌన్ : ఓటు వేసేందుకు వెళ్లే వారు సెల్‌ఫోన్‌ను బయట ఉన్న అధికారికి ఇచ్చి వెళ్లాలి. ఒక వేళ సెల్‌ఫోన్ తీసుకెళ్లి ఓటు వేస్తూ సెల్ఫీ దిగడానికి ప్రయత్నిస్తే నేరంగా పరిగణిస్తారు. ఓటు వేస్తూ సెల్ఫీ తీసినట్లు గుర్తిస్తే అధికారులు వెంటనే అతడిని బయటకు పంపిస్తారు. వేసిన ఓటును 17– ఏలో నమోదు చేస్తారు. ఓట్ల లెక్కింపు సమయంలో సదరు వ్యక్తి వేసిన ఓటు పరిగణలోకి తీసుకోరు. రూల్ నంబర్ 49– ఎన్ ప్రకారం అంధులైన ఓటర్లు ఓటు వేయ డానికి 18 ఏళ్లుకు పైగా ఉన్న సహాయకుడిని వెంట తీసుకొని వెళ్లవచ్చు. అతడి ఓటును బహిరంగ పర్చనని సహాయకుడు నిబంధన–10లో ధ్రువీకరించాల్సి ఉంటుంది.


