మీ ఓటు నన్ను మేయర్‌ను చేస్తుంది
జవాబుదారీగా పనిచేస్తా..
కార్పొరేషన్ కావడం అదృష్టం
ఫ 38వ డివిజన్ ప్రజలకు మా కుటుంబం రుణపడి ఉంది
ఫ నా భర్త శ్రీనివాస్‌రెడ్డి ఇక్కడ నుంచి మూడు సార్లు కౌన్సిలర్‌గా గెలిచారు
ఫ నన్ను కూడా ఆదరించి గెలిపించాలి
ఫ మంత్రి సహకారంతో కార్పొరేషన్‌ను అభివృద్ధి చేసే అవకాశం వస్తుంది
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి
నల్లగొండ : ‘నల్లగొండలోని 32వ డివిజన్ ప్రజలకు మా కుటుంబం ఎంతో రుణపడి ఉంది. నా భర్త బుర్రి శ్రీనివాస్‌రెడ్డిని మూడు పర్యాయాలు గెలిపించారు. ఆయన మున్సిపల్ చైర్మన్‌గానూ పనిచేశారు. ప్రస్తుతం ఈ డివిజన్ నుంచి నేను కార్పొరేటర్‌గా పోటీ చేస్తున్నా. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నన్ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. మీరు వేసే ఓటు నన్ను మేయర్‌ను చేస్తుంది’ అని కాంగ్రెస్ పార్టీ 32వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా సోమవారం ఆమె ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆమె మాటల్లోనే..
నల్లగొండను స్మార్ట్ సిటీగా చేసేందుకు మంత్రి కోమటిరెడ్డి కంకణ బద్ధులయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి సహకారంతో రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అమృత్ పథకం కింద రూ.216 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ, తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు 11 ట్యాంకుల నిర్మాణం చేపట్టారు. 24 గంటలు కృష్ణా జలాలు అందించేందుకు రూ.125 కోట్లతో పనులు సాగుతున్నాయి. అంతర్గత సీసీ రోడ్లు, శ్మశాన వాటిక అభివృద్ధి, బస్టాండ్ నుంచి మేకల అభినవ్ స్టేడియం వరకు, డీఈఓ ఆీఫీస్ నుంచి మిర్యాలగూడ రోడ్డు వరకు బీటీ రోడ్లు, పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయం నుంచి రూ.900 కోట్లతో రింగు రోడ్డు పనులు వేగంగా సాగుతున్నాయి. పట్టణంలో విద్యుత్ లోవోల్టేజీ సమస్య పరిష్కారానికి ఐదు సబ్‌స్టేషన్ల నిర్మాణం పూర్తయింది. మెడికల్ కాలేజీ ప్రారంభించాం. రూ.100 కోట్లతో ముశంపల్లి రోడ్డును అభివృద్ధి చేసుకుంటున్నాం. రూ.40 కోట్లతో నర్సింగ్ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ సెంటర్, రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల పనులు చేపట్టారు. నల్లగొండకు తలమానికం అయిన లతీప్‌సాబ్ దర్గా, బ్రహ్మంగారి గుట్టకు రూ.140 కోట్లతో ఘాట్‌రోడ్డు పనులు జరుగుతున్నాయి. రూ.150 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రికి కొత్త భవనం నిర్మిస్తున్నాం.
నన్ను ఆదరించి గెలిపిస్తే ప్రజలకు జవాబు దారీగా పని చేస్తా. 32వ డివిజన్‌ను పట్టణంలోనే మరింత అందంగా తీర్చిదిద్దుతా. మంత్రి సహకారంతో ఒక మహిళగా అభివృద్ధి చేసే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా.
కార్పొరేషన్ కావడం నిజంగా అదృష్టం. తద్వార కేంద్రం నిధులు తీసుకొచ్చి మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. కార్పొరేషన్‌లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే మంత్రి కోమటిరెడ్డి సహకారంతో నల్లగొండను ఎంతో అభివృద్ధి చేసుకోవచ్చు. కాంగ్రెస్ అధికారంలో ఉంది. నల్లగొండకు కొండంత అండగా కోమటిరెడ్డి ఉన్నాడు. పట్టణ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌కు మద్దతు పలికి అత్యధిక మెజార్టీతో విజయం సాధించేందుకు సహకరించాలి.
మీ ఓటు నన్ను మేయర్‌ను చేస్తుంది


