నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
నల్లగొండ టూటౌన్ : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు సోమవారం నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్నారు. పరీక్షలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు జిల్లాలోని 143 జూనియర్ కళాశాలల నుంచి 9,251 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. జనరల్‌లో 6,092 మంది, ఒకేషనల్ విభాగంలో 3,159 మంది పరీక్షలు రాయనున్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఎంపీసీలో 3850 మంది, బైపీసీలో 2016 మంది హాజరు కానున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రాక్టికల్ పరీక్షలకు 86 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల సమయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్లయింగ్ స్క్యాడ్ ఏర్పాటు చేసినట్లు డీఐఈవో దస్రూనాయక్ తెలిపారు.
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి
నల్లగొండ టౌన్ : నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో సీపీఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లింకంటి సత్యం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం నల్లగొండలోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లగొండ కార్పొరేషన్‌లో సీపీఐకి ఒక కో–ఆప్షన్ పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందని తెలిపారు. సమావేశంలో నాయకులు మల్లేపల్లి ఆదిరెడ్డి, పబ్బు వీరాస్వామి, కెఎస్.రెడ్డి, వి.లెనిన్, మదార్, ముండ్ల ముత్యాలు, యూసుఫ్, వెంకట్‌రావు, రెవెల్లి యాదయ్య, ఐతరాజు శంకర్, దోటి పండరి, గుండె రవి, సుజాత, విజయ, ధనలక్ష్మి, వీరయ్య తదితరులు ఉన్నారు.
ఆకట్టుకున్న
‘కూచిపూడి’ ప్రదర్శన
భువనగిరి : మండలంలోని రాయగిరి గ్రామ పరిధిలోని మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌కు చెందిన కూచిపూడి నాట్య గురువు ప్రవీణ్ శిష్య బృందం ఆధ్వర్యంలో కూచిపూడి నాట్య ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది. కార్యక్రమంలో నాట్య కళాకారిణిలు నవ్య, నాగశ్రీ, రమ్మ, దశరథ, కౌసల్య, చందన తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్


