జీజీహెచ్‌లో ల్యాబ్‌ సర్వీస్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌లో ల్యాబ్‌ సర్వీస్‌ ప్రారంభం

Feb 8 2026 11:15 AM | Updated on Feb 8 2026 11:15 AM

జీజీహ

జీజీహెచ్‌లో ల్యాబ్‌ సర్వీస్‌ ప్రారంభం

నల్లగొండ టౌన్‌ : నల్లగొండలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ఓపీ రోగులకు వైద్య పరీక్షల కోసం ఓపీ విబాగం పక్కనే ప్రత్యేక ల్యాబ్‌ సర్వీస్‌ను ఏర్పాటు చేశారు. ఆ కేంద్రంలోనే అవుట్‌ పేషెంట్స్‌ రక్త, మూత్ర పరీక్షల కోసం శాంపిల్స్‌ సేకరించి త్వరగా పరీక్షల రిపోర్టును అందించనున్నారు. దీంతో వారికి సమయం ఆదా కావడంతో పాటు వెంటనే సరైన చికిత్సలు అందించే అవకాశం ఉంది. ప్రత్యేక ల్యాబ్‌ సర్వీసును సూపరింటెండెంట్‌ డాక్టర్‌ గుర్రం నరసింహారావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓపీ విభాగంతో పాటు క్యాజువాలిటీలో కూడా మెడికో లీగల్‌ కేసుల కోసం ప్రత్యేకమైన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కౌంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీని వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు ఇబ్బందులు తప్పనున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నగేష్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రత్నప్రభ, ఆర్‌ఎంఓ డాక్టర్‌ చంద్రశేఖర్‌, డాక్టర్‌ రత్న, రజని, డాక్టర్‌ మహేష్‌, స్పందన, తార, సునీత, శ్రీలత, సాగర్‌ పాల్గొన్నారు.

పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు

పెద్దవూర : కసి, పట్టుదల ఉంటే ఎంతటి లక్ష్యమైనా సాధించవచ్చని గర్ల్స్‌ చైల్డ్‌ ఎంపర్‌మెంట్‌ మోటివేటషన్‌ స్పీకర్‌, ఎంజీ యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గంజి భాగ్యలక్ష్మి అన్నారు. శనివారం పెద్దవూర జెడ్పీహెచ్‌ఎస్‌లో విద్యార్థులకు మోటివేషనల్‌ స్కిల్స్‌పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. మేధావులంతా ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారేనని గుర్తుంచుకోవాలన్నారు. ప్రయత్నం ఉంటే ఎన్ని అవరోధాలు ఎదురైనా అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని చెప్పారు. ప్రతి పుస్తకంలోనూ ఏదో ఒక విషయం ఉంటుందని, పుస్తకాన్ని మించిన నేస్తం లేదని చెప్పారు. కార్యక్రమంలో ఎంఈఓ తరి రాములు, ఉపాధ్యాయులు రమాదేవి, కృష్ణయ్య, రాములు, భాస్కర్‌, వాలియా, దూదియా, ఇంధుమతి, అరవింద్‌రెడ్డి, పద్మావతి, చంద్రమణి, లలిత, జానమ్మ, హైమావతి, సీఆర్‌పీ వెంకటయ్య పాల్గొన్నారు.

విశ్వవిద్యాలయాలు.. ప్రయోగాల కేంద్రాలు

నల్లగొండ టూటౌన్‌ : సమాజ హితమైన ప్రయోగాల కేంద్రాలుగా విశ్వవిద్యాలయాలు తయారు కావాలని ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌ అన్నారు. శనివారం ఆయన నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, వృక్షశాస్త్రాల విభాగాల ఆధ్వర్యంలో మార్చి 24, 25 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ సదస్సు పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. మార్చి నెలలో ‘ఆరోగ్యవంతమైన భూమండలం కొరకు జీవశాస్త్రాల్లో ఆవిష్కరణలు’ అనే అంశంపై ఎంజీ యూనివర్సిటీలో జాతీయ సదస్సును నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ అలువాల రవి, ప్రేమ్‌సాగర్‌, మాధురి, వసంత, అన్నపూర్ణ, ఆర్‌ఎస్‌ బుట్టి, శివరాం, రామచందర్‌గౌడ్‌, అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు.

సాగర్‌కు లోకాయుక్త న్యాయమూర్తి

నాగార్జునసాగర్‌ : తెలంగాణ రాష్ట్ర లోకాయుక్త న్యాయమూర్తి ఏ.రాజశేఖర్‌రెడ్డి శనివారం నాగార్జునసాగర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్‌విహార్‌ అతిథి గృహానికి చేరుకున్న ఆయనకు నిడమనూరు కోర్టు సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌శర్మ, ప్రొటోకాల్‌ అధికారి దండా శ్రీనివాస్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

జీజీహెచ్‌లో ల్యాబ్‌ సర్వీస్‌ ప్రారంభం1
1/2

జీజీహెచ్‌లో ల్యాబ్‌ సర్వీస్‌ ప్రారంభం

జీజీహెచ్‌లో ల్యాబ్‌ సర్వీస్‌ ప్రారంభం2
2/2

జీజీహెచ్‌లో ల్యాబ్‌ సర్వీస్‌ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement