శేషవాహనంపై రామలింగేశ్వరుడు
నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగ్వేర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారి సేవను శేషవాహనంపై ఊరేగించారు. ఉదయం సూర్య నమస్కారాలు, రుద్రహోమం, బలిహారణ, ఏకాదశ రుద్రాభిషేకం, మహానివేదన పూజలను ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, సురేశ్‌శర్మ, శ్రీకాంత్‌శర్మ, సతీ ష్‌శర్మ, జగదీష్‌శర్మ అర్చకులు వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్, ఈఓ మోహన్‌బాబు, ఉత్సవ కమిటీ చైర్మన్ వరాల రమేష్, సర్పంచ్ రేతగాని కృష్ణ, గడుసు శశిదర్‌రెడ్డి ఉన్నారు,
దర్శనాల ద్వారా రూ.16,91,620 ఆదాయం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణానికి వచ్చేసిన భక్తుల ప్రత్యేక దర్శనం ద్వారా ఆలయానికి రూ.16,91,620 ఆదాయం వచ్చినట్లు ఈఓ మోహన్‌బాబు తెలిపారు. ప్రసాద విక్రయాల ద్వారా రూ.12,27,920, ప్రత్యేక దర్శనాల ద్వారా రూ.2,35,200, కల్యాణ టికెట్ల ద్వారా రూ.1,95,00, ఇతర సేవల ద్వారా రూ.33,500 ఆదాయం వచ్చినట్లు వివరించారు.


