టికెట్ల కేటాయింపులో అందరికీ న్యాయం | - | Sakshi
Sakshi News home page

టికెట్ల కేటాయింపులో అందరికీ న్యాయం

Feb 2 2026 7:17 AM | Updated on Feb 2 2026 7:17 AM

టికెట్ల కేటాయింపులో అందరికీ న్యాయం

టికెట్ల కేటాయింపులో అందరికీ న్యాయం

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్లగొండ కార్పొరేటర్‌

అభ్యర్థులతో జూమ్‌ మీటింగ్‌

ఎన్నికల సన్నద్ధంపై దిశా నిర్దేశం

నల్లగొండ : నల్లగొండ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అభ్యర్థుల ఖరారులో కాంగ్రెస్‌ పార్టీ సామాజిక వర్గాల వారీగా సమన్యాయం పాటించామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటోగ్రఫ్రి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్‌ అభ్యర్థులతో ఆదివారం ఆయన హైదరాబాద్‌ నుంచి జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మీరు గెలిస్తే నేను గెలిచినట్లేనని.. మీ గెలుపు, నా గెలుపు పేదల గెలుపు’ అన్నారు. నల్లగొండలో 48 కి 48 మంది కార్పొరేటర్లు గెలిస్తే పట్టణాభివృద్ధికి ఎన్ని నిధులైనా తెస్తానన్నారు. నల్లగొండలో బీసీలకు 70శాతం సీట్లు కేటాయించి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచామన్నారు. మీరు గెలిచి.. అభివృద్ధి విషయం తనకు వదిలేయమని చెప్పారు. ప్రతి ఓటరును కలిసి వారికి భరోసా ఇవ్వాలని సూచించారు. ఈ జూమ్‌ మీటింగ్‌లో నల్లగొండ మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాశం రాంరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మేయర్‌ అభ్యర్థి బుర్రి చైతన్య, బొడ్డుపల్లి లక్ష్మీశ్రీనివాస్‌, అబ్బగోని రమేష్‌గౌడ్‌, కార్పొరేటర్‌ అభ్యర్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement