బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలి
నల్లగొండ టూటౌన్: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కోరారు. శుకవారం వారు నల్లగొండలోని 5, 13, 21, 14, 45, 46, 15, 16, 17 డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుపై ఓటేసి బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే నీలగిరి పట్టణ రూపురేఖలు మారుస్తామన్నారు. నల్లగొండ నియోజకవర్గానికి కేసీఆర్ రూ.1500 కోట్లు వెచ్చించి అభివృద్ధి చేశాడని గుర్తుచేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ అభ్యర్థులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


