ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు
నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్స్‌లో ప్రవేశాలకు ఈ నెల 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి శశికళ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీ పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. http://tsstudycircle.co.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 25న హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని, మార్చి 1న ఉదయం 11.00 గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నల్లగొండలోని నాగార్జున డిగ్రీ కళాశాలలో ప్రవేశపరీక్ష ఉంటుందని తెలిపారు. వివరాలకు 9396621492 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
క్యాన్సర్‌పై ఎంజీయూలో అవగాహన సదస్సు
నల్లగొండ టూటౌన్ : వరల్డ్ క్యాన్సర్‌డే సందర్భంగా బుధవారం నల్లగొండలోని ఎంజీయూలో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజేశ్వరి మాట్లాడుతూ క్యాన్సర్ ప్రాథమిక దశలో గుర్తిస్తే సరైన సమయంలో టీకా తీసుకోవడం ద్వారా ఈ వ్యాధులను ముందుగానే నివారించవచ్చున్నారు. టీకా ప్రాధాన్యత, అవసరం, ప్రయోజనాలను ఆమె వివరించారు. ఈ సదస్సులో డాక్టర్లు వసంతకుమారి, శ్రీదేవి, మారం వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.
వైద్య కళాశాల
అధ్యాపకులకు శిక్షణ
నల్లగొండ టౌన్ : గాంధీ మెడికల్ కాలేజీ సికింద్రాబాద్ ఎన్‌ఎంసీ ప్రాంతీయ కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం నల్లగొండలోని ప్రభుత్వ వైద్య కళాశాల అధ్యాపకులకు బేసిక్ కోర్స్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్–2026 అంశంపై మూడు రోజులపాటు శిక్షణనిచ్చారు. మెడికల్ విద్యార్థులకు మెరుగ్గా బోధించేందుకు అవసరమైన ఆధునిక బోధనా పద్ధతులపై అధ్యాపకుల్లో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్లు కిరణ్ మాదల, శివ, రాంచందర్, తిరుపతిరావు, స్వరూపారాణి, అనుపమ, గీత పాల్గొన్నారు.
వేణుగోపాలస్వామి ఊరేగింపు
నార్కట్‌పల్లి: మండలంలోని గోపలాయపల్లి సమీపంలో ఉన్న శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీవారిజాల వేణుగోపాలస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల ముగింపు రోజైన బుధవారం వారిజాల వేణుగోపాలస్వామి గ్రామోత్సవం(ఊరేగింపు) కార్యక్రమాన్ని ఆలయ అనువంశిక చైర్మన్ కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు వేదమంత్రాలతో కనులపండువగా నిర్వహించారు. స్వామివారి ఊరేగింపు గట్టుపై నుంచి గోపలాయపల్లి గ్రామంలోని ప్రధాన వీధుల్లో కొనసాగింది. భక్తులు, మహిళలు కోలాటం ఆడారు. ఈ వేడుకల్లో సర్పంచ్ మచ్చ జయసుధ ముత్యాలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ధార యాదయ్య, ఈఓ వెంకటరెడ్డి, దోసపాడు విష్ణుమూర్తి, బాసెట్టి శ్రీనివాస్, నరసింహ, రామ్ గోపాల్‌రెడ్డి, వరలక్ష్మి, గోసుల భద్రాచలం, మచ్చ నరేష్, గోసుల సుదర్శన్, పాండు, కృష్ణయ్య, ఎర్రయ్య పాల్గొన్నారు.
యాదగిరి క్షేత్రంలో
సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. బుధవారం వేకువజామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు


