కార్పొరేషన్‌లో చరిత్రాత్మక తీర్పునివ్వాలి
నల్లగొండ : నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు చరిత్రాత్మక తీర్పునివ్వాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలోని 10, 11, 6, 7, 8, 9, 25 డివిజన్లలో నిర్వహించిన జరిగిన సభల్లో మంత్రి మాట్లాడారు. మొదటిసారి జరుగుతున్న కార్పొరేషన్ ఎన్నికల్లో 48 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అధికార పార్టీ అభ్యర్థులు గెలిస్తే అభివృద్ధి సాద్యమవుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని.. తాను మంత్రిగా ఉన్నానని.. ఏ సమస్య ఉన్నా పరిష్కరించే బాధ్యత తనదేనన్నారు. నల్లగొండలో రూ.2200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మేయర్ ఎన్నిక తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నల్లగొండను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతానన్నారు. తనను టైదు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన ఇక్కడి ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. నల్లగొండ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అభ్యర్థి మేయర్ కావాలని.. ప్రజలు ఆలో చించి ఓటు వేయాలన్నారు. ఏ సమస్య వచ్చి నా కార్పొరేటర్ తనకు చెబితే వెంటనే పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ హపీజ్‌ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీని వాస్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అద్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పాశం రాంరెడ్డి, వంగూరి లక్ష్మయ్య, ఆయా డివిజన్ల నాయకులు పాల్గొన్నారు.
ఫ నీలగిరిలోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులే గెలవాలి
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి


