నేడు, రేపు సెలవు | - | Sakshi
Sakshi News home page

నేడు, రేపు సెలవు

Feb 10 2026 8:04 AM | Updated on Feb 10 2026 8:04 AM

నేడు, రేపు సెలవు

నేడు, రేపు సెలవు

నల్లగొండ : మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీల పరిధిలోని విద్యా సంస్థలన్నింటికీ ఈనెల 10, 11 తేదీల్లో సెలవులు ప్రకటిస్తూ కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి చంద్రశేఖర్‌ సోమవారం ఒక ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు. నల్లగొండ మున్సిపల్‌ కార్పొరేషన్‌, మిర్యాలగూడ, హలియా, నందికొండ, చండూరు, దేవరకొండ, చిట్యాల మున్సిపాలిటీల పరిధిలోని అన్ని విద్యాసంస్థలకు ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌కు వినియోగించుకుంటున్న అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ భవనాలకు 10, 11 తేదీల్లో సెలవులు వర్తిస్తాయని పేర్కొన్నారు.

మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌దే విజయం

డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్‌

నల్లగొండ : రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో జిల్లాలోని నల్లగొండ కార్పొరేషన్‌తో పాటు ఆరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధిస్తుందని డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్‌ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఆయన నల్లగొండలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని ఓ పక్క అభివృద్ధి పథంలో నడిపిస్తూ.. మరో పక్క సంక్షేమ పథకాలు చేపట్టి పేదలకు అందిస్తున్నాడని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుందని అదే తరహాలో మున్సిపాలిటీల్లో కూడా విజయం సాధిస్తుందన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒకటే అని, ప్రజలంతా ఆలోచించి కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని కోరారు. సమావేశంలో జిల్లేపల్లి పరమేష్‌, ఎండీ.ముంతాజ్‌ అలీ, భవ్యతేజ్‌రెడ్డి, గౌతమ్‌, రవీందర్‌రెడ్డి, పగిల్లరాజు, శరత్‌, జస్వంత్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement