మెనూ ప్రకారం భోజనం అందించాలి
● కలెక్టర్ చంద్రశేఖర్
మిర్యాలగూడ : ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. బుధవారం ఆయన మిర్యాలగూడ పట్టణంలోని బాలికల వసతిగృహాన్ని ఆకస్మికంగా సందర్శించి రికార్డులను, వంట గదిని, భోజనాన్ని, బియ్యం, వంట సామగ్రిని పరిశీలించి మాట్లాడారు. సిబ్బంది నాణ్యమైన సరుకులు, తాజా కూరగాయాలతో వంటలు వండి విద్యార్ధులకు అందించాలన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు.


