వీఐపీ వార్డు
పొలిటీషియన్స్‌కు నిలయం.. కృష్ణానగర్
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు కృష్ణానగర్ కాలనీలో ప్రముఖులు, రాజకీయ నాయకులు ఎక్కువగా నివసిస్తుండటం విశేషం. 1980లో ఏర్పడిన ఈ కాలనీ కొత్త బస్టాండ్‌కు సమీపంలో ఉండటంతో ప్రముఖులు ఎక్కువగా ఉంటున్నారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్, గోదల రంగారెడ్డి, ప్రముఖ విద్యాసంస్థల అధినేత అంగిరేకుల నాగార్జున ఈ కాలనీలో నివాసముంటుండగా.. గతంలో మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం ఇక్కడ ఉన్నారు. ఇదే వార్డులోని వెంకటేశ్వర కాలనీలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు నివసిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్డులో 2737 మంది ఓటర్లు ఉన్నారు. రిజర్వేషన్ బీసీ జనరల్‌కు వచ్చింది. ఈ వార్డు నుంచి 18 మంది అభ్యర్థులు ఆయా పార్టీల నుంచి నామినేషన్లు వేశారు. 14వ వార్డులో ఈ కాలనీతో పాటు మరో రెండు, మూడు కాలనీలు కలిసి ఉన్నాయి.
ప్రముఖులకు కేరాఫ్ రెడ్డికాలనీ
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులో ఉన్న రెడ్డికాలనీ ప్రముఖులకు కేరాఫ్‌గా మారింది. ఈ కాలనీలో 30 ఏళ్ల క్రితం మొదటగా సాయి అపార్ట్‌మెంట్, అహల్యా అపార్ట్ మెంట్‌ను నిర్మించారు. క్రమంగా జనసంఖ్య పెరిగి ఇప్పడు 15 అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. మిగతావి నివాస గృహాలు ఉన్నాయి. అపార్ట్‌మెంట్లలో గతంలో కేవలం 30 కుటుంబాలు ఉండగా.. ప్రస్తుతం 400కు పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ప్రస్తుతం కాలనీ జనాభా 3500 మంది ఉండగా 2,321 మంది ఓటర్లు ఉన్నారు. ఈ కాలనీలో ప్రముఖ వైద్యులు శ్రీనివాస్‌రావు, అశోక్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, రమాదేవి, జేఏసీ కన్వీనర్ మాలి ధర్మపాల్‌రెడ్డితో పాటు ప్రముఖ మిల్లర్లు నివాసం ఉంటున్నారు.
వీఐపీ వార్డు


