నేడు జవహర్‌ నవోదయ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

నేడు జవహర్‌ నవోదయ పరీక్ష

Feb 7 2026 2:48 PM | Updated on Feb 7 2026 2:48 PM

నేడు జవహర్‌ నవోదయ పరీక్ష

నేడు జవహర్‌ నవోదయ పరీక్ష

పెద్దవూర : పెద్దవూర మండలం చలకుర్తి జవహర్‌ నవోదయ విద్యాలయంలో ప్రవేశానికి శనివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 2026–27 విద్యా సంవత్సరానికి 9వ, ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న వారికి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు విద్యాలయం ప్రిన్సిపాల్‌ కె.శంకర్‌ తెలిపారు. 9వ తరగతికి 447 మంది బాలురు, 329 మంది బాలికలు మొత్తం 776 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. వీరికి నల్లగొండ జిల్లా కేంద్రంలోని ది నల్లగొండ పబ్లిక్‌ స్కూల్‌, దేవరకొండ రోడ్డులోని గవర్నమెంట్‌ బాలుర హైస్కూల్‌, పెద్దవూర మండలం చలకుర్తి క్యాంపు జవహర్‌ నవోదయ విద్యాలయంలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష ఉదయం 11.15 నుంచి మధ్యాహ్నం 1.45 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ఇంటర్‌ విద్యార్థులకు

ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి 924 మంది బాలురు, 1,009 మంది బాలికలు మొత్తం 1933 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. వీరికి సూర్యాపేట జిల్లాలోనే 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు తమ వెంట హాల్‌టికెట్‌, రైటింగ్‌ ప్యాడ్‌, బ్లూ లేదా బ్లాక్‌ పాయింట్‌ పెన్‌ తీసుకురావాలని సూచించారు.

పరీక్షా కేంద్రాల వివరాలు

సూర్యాపేటలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌ ఇమాంపేట, జెడ్పీహెచ్‌ఎస్‌(బాలుర), గవర్నమెంట్‌ (ఎంఏఎం) హైస్కూల్‌, జెడ్పీహెచ్‌ఎస్‌(బాలికలు) మున్సిపల్‌ ట్యాంకు దగ్గర, గవర్నమెంట్‌ హైస్కూల్‌ నంబర్‌–2, కోదాడలోని కేఎస్‌ ఎస్‌బీఎం జెడ్పీహెచ్‌ఎస్‌ బాలురు, జెడ్పీహెచ్‌ఎస్‌ బాలురు, సెయింట్‌ జోసెఫ్‌ సీసీఆర్‌ హైస్కూల్‌.

ఫ 9వ తరగతి, ఇంటర్‌లో ప్రవేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement