పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు అప్పగింత
నల్లగొండ: నల్లగొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న 60 మందికి మంగళవారం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో అదనపు ఎస్పీ జి. రమేష్ తిరిగి అప్పగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సెల్‌ఫోన్ పోగొట్టుకున్న వారు వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఐఆర్ పోర్టల్‌లో వివరాలను నమోదు చేయాలన్నారు. దీనివల్ల ఫోన్ బ్లాక్ చేసి పోలీసులు త్వరగా ఫోన్‌ను కనిపెట్టే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం సీఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్లను ట్రేస్ చేసి రికవరీ చేసిన పోలీసులను అభినందించారు. కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ కె. శివరాంరెడ్డి, వన్‌టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐలు గోపాల్‌రావు, వెంకటనారాయణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


