యాదగిరీశుడికి విశేష పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం నిత్య పూజలు కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతం నిర్వహించారు. అనంతరం అంతరాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం నిర్వహించి, సహస్త్ర నామార్చన పూజను జరిపించారు. ఇక ఆలయ ముఖ మండపంలో సువర్ణ ఉత్సవమూర్తుల వద్ద అష్టోత్తరం, సువర్ణ పుష్పార్చన పూజలు చేపట్టారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు జరిపించారు. సాయంత్రం జోడు సేవను ఊరేగించారు.


