రాచకొండకు పూర్వ వైభవం తీసుకొస్తా
సంస్థాన్ నారాయణపురం : రాచకొండకు పూర్వ వైభవం తీసుకొచ్చి ఆధ్యాత్మిక, పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. రాచకొండలో రాచప్ప సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాచకొండ పర్యాటక ఉత్సవాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. రాచకొండ తవ్వకాల్లో బయల్పడిన స్వయంభూ శంభులింగేశ్వర స్వామికి ఎమ్మెల్యే దంపతులు జల, పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే రాచకొండ పర్యాటక ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. దశాబ్దాల క్రితం రాజధానిగా వెలుగొందిన రాచకొండ అభివృద్ధి కోసం మంత్రి జూపల్లి కృష్ణారావుతో మాట్లాడతానని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణం పూర్తికి సహకారమందిస్తానన్నారు. రాచకొండ అభివృద్ధికి కృషిచేస్తున్న రాచప్ప సమితిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుత్తా ఉమాదేవిప్రేమ్‌చందర్‌రెడ్డి, సర్పంచ్‌లు కాట్రోతు లక్ష్మీసాగర్, కవితరఘు, జర్పుల జగన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కరెంటోతు శ్రీనునాయక్, మందుగుల బాలకృష్ణ, ఉప్పల లింగస్వామి, ఎనుముల శంకర్‌రెడ్డి, రాచప్ప సమితి ఆధ్యక్షుడు బద్దుల కృష్ణకుమార్, ప్రధాన కార్యదర్శి సూరపల్లి వెంకటేశం, కడారి అంజిరెడ్డి పాల్గొన్నారు.
మునుగోడు ఎమ్మెల్యే
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి


