ప్రభుత్వ భూమిలో చెట్ల నరికివేత | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భూమిలో చెట్ల నరికివేత

Feb 23 2026 7:11 AM | Updated on Feb 23 2026 7:11 AM

ప్రభుత్వ భూమిలో చెట్ల నరికివేత

ప్రభుత్వ భూమిలో చెట్ల నరికివేత

పెద్దవూర : ప్రైవేటు భూములు, బహిరంగ ప్రదేశాల్లో ఒక చెట్టును నరకాలంటేనే అధికారుల అనుమతి తీసుకోవాలి. అలాంటింది ప్రభుత్వ భూ మిలో ఎవరి అనుమతులు తీసుకోకుండా వందల సంఖ్యలో చెట్లను నరికివేస్తున్నా అధికారులు పట్టించుకోని పరిస్థితి. ఈ ఘటన పెద్దవూర మండలం కోమటికుంటతండాపరిధిలోని కేంద్ర ప్రభుత్వ భూమిలో ఆదివారం వెలుగుచూసింది. తండాలోని అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌(ఏఎండీ)యూరేనియం క్యాంపు భూమిలో పదేళ్ల క్రితం వందల సంఖ్యలో మొక్కలు నాటారు. అవి ప్రస్తుతం పెద్ద చెట్లుగా ఎదిగాయి. వీటిని అక్రమార్కులు మూడు రోజులుగా నరికివేస్తున్నారని తండావాసులు ఆరోపిస్తున్నారు. రఏటా రూ.కోట్లు ఖర్చు చేసి హరితహారం కింద మొక్కలను నాటుతుంటే ఇలా నరకడం ఏంటని స్థానికులు అంటున్నారు.

అమలుకు నోచుకోని వాల్టా చట్టం

ప్రభుత్వ అటవీ సంపదను కాపాడటానికి తీసుకొచ్చిన వాల్టా చట్టం క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. చెట్లను నరికివేయాలంటే కనీసం గ్రామ పంచాయతీ పాలకవర్గం అనుమతినైనా తీసుకోవాలి. అలాంటిది.. ఎవరి అనుమతి లేకుండా వందల సంఖ్యలో చెట్లను ఎలా నరికివేస్తారని కోమటికుంటతండా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇక్కడ చెట్లు ఎందుకు నరుకుతున్నారో అర్థంకాని పరిస్థితి. ఈ విషయాన్ని ఎవరికై నా ఫిర్యాదు చేద్దామన్నా ఇక్కడ ఎవరూ ఉండరని స్థానికులు చెబుతున్నారు.

ఫ కోమటికుంటతండాలో

అక్రమార్కుల నిర్వాకం

ఫ కేంద్ర ప్రభుత్వ స్థలంలో

అనుమతుల్లేకుండా నరికివేత

ఫ ఎవరూ పట్టించుకోవట్లేదని

స్థానికుల ఆరోపణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement