పేదలకు వైద్య సేవలు అందుబాటులోకి తేవాలి
నల్లగొండ టౌన్: పేదలకు వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్ల గొండ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో నూతనంగా నెలకొల్పిన లాలిత్య స్కిన్ అండ్ లేజర్ ఆస్పత్రిని ఆదివారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు. పేదవారికి, మధ్యతరగతి రోగులకు మెరుగైన చికిత్స అందించి అవసరమైనంత మేరకు మందులు అందించినప్పుడే ఆస్పత్రులు ప్రజాదరణ పొందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య, డిప్యుటీ మేయర్ అష్రాఫ్ అలీ, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి, డాక్టర్లు లాలిత్య శశాంక్, గౌరిశ్రీ, హరినాథ్, సాయిలావణ్య, రవిశంకర్ కన్నా, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి


