మున్సిపాలిటీల్లో ఆశావహులు అధికంగానే..
● చండూరు మున్సిపాలిటీ చైర్మన్ పదవి కోసం కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్‌గా రుషిపాక వాసు, కలిమికొండ పారిజాత, భూతరాజు దశరథ పోటీ పడుతున్నారు. మిత్రపక్షమైన సీపీఐ అభ్యర్థి జెల్లా ధనమ్మ కూడా చైర్మన్ పదవి ఆశిస్తున్నారు. క్యాంపునకు తరలివెళ్లిన కౌన్సిలర్లతో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
● మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఎన్నికలకు ముందు చైర్మన్ అభ్యర్థి ఎవరన్నది ప్రకటించలేదు. ప్రస్తుతం నూకల వేణుగోపాల్‌రెడ్డి సతీమణి నూకల కవిత, గుడిపాటి నవీన్ సతీమణి శిరీష, చిలుకూరు బాలు సతీమణి సుధ, వెంకటేష్ తల్లి శ్రీదేవి చైర్మన్ పదవికి పోటీ పడుతున్నారు. వీరిలో ఒకరు చైర్మన్ కానున్నారు.
● హాలియా మున్సిపాలిటీలో చింతల చంద్రారెడ్డి, కుందూరు వెంకట్‌రెడ్డి, గౌని రాజా రమేష్‌యాదవ్ మున్సిపల్ చైర్మన్ రేసులో ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డితో మంతనాలు చేస్తున్నారు. వీరిలో ఒకరు చైర్మన్ అయ్యే అవకాశం ఉంది. వైస్ చైర్మన్‌గా చెరుపల్లి ముత్యాలు పేరును ప్రకటించే అవకాశం ఉంది.
● చిట్యాల మున్సిపాలిటీలో జనరల్ మహిళకు కేటాయించినందున పందిరి గీతా రమేష్ చైర్మన్ పదవికి పోటీ పడుతున్నారు. వైస్ చైర్మన్ పదవి బీసీ, రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గాల్లో ఎవరికి ఇస్తారనే దానిపై చర్చ సాగుతోంది.
● దేవరకొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పటికే క్యాంపునకు వెళ్లారు. చైర్మన్ అభ్యర్థిగా పున్న శైలజా వెంకటేష్‌ను నామినేషన్లకు ముందుగానే ఎమ్మెల్యే బాలునాయక్ ప్రకటించారు. ఆమె ఎంపిక లాంఛనమే కానుంది. వైస్ చైర్మన్ పదవికి మైనార్టీ వర్గం నుంచి ముగ్గురు పోటీ పడుతున్నారు. వారిలో ఎవరికి దక్కుతుందనే దానిపై చర్చ సాగుతోంది.
● నందికొండ మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరన్నది ఇంతవరకు ప్రకటించలేదు. ఆదివారం మాజీ మంత్రి జానారెడ్డితో పాటు ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


