ఫ మా తుఝే సలాం
మంత్రి కోమటిరెడ్డి శుభాకాంక్షలు
నల్లగొండ : శివరాత్రి సందర్భంగా జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శివయ్య అనుగ్రహంతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఆ పరమేశ్వరుడు అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఈ పవిత్ర లింగోద్భవ కాలం అందరికీ ప్రశాంతతను చేకూర్చాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆలయాలకు వెళ్లే భక్తులకు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.
16న కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం
నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఈ నెల 16న నిర్వహించనున్నట్లు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి.శరత్‌చంద్ర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
సాగర్‌ను సందర్శించిన కలెక్టర్
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్‌ను శని వారం కలెక్టర్ చంద్రశేఖర్.. కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. బుద్ధవనంలోని మ హాస్తూపం, స్తూపపార్కు తదితర ప్రాంతాలను వీక్షించారు. వీరికి పర్యాటక శాఖ గైడ్ సత్యనారా యణ నాగార్జునసాగర్ ప్రాజెక్టు, బుద్ధవనం వివరాలను తెలియజేశారు. ఆయన వెంట పెద్దవూర ఆర్‌ఐ దండ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.
హెచ్‌పీవీ టీకాపై అవగాహన
నల్లగొండ టౌన్: నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం 150 మంది ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకాలుపై అవగాహన సమావేశం నిర్వహించారు. అదేవిధంగా గర్భాశయ ముఖ క్యాన్సర్ స్క్రీనింగ్‌పై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థినులకు థైరాయిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు వసంతకుమారి, రాజేశ్వరి, రమేష్, రాజిరెడ్డి, రమణారెడ్డి, ప్రిన్సిపాల్ ప్రశాంతి వసంత్, పృథ్వీరాజ్, సరిత, అశ్విని, లావణ్య, శ్రీతి, మౌనిక పాల్గొన్నారు.
ఫ మా తుఝే సలాం
ఫ మా తుఝే సలాం
ఫ మా తుఝే సలాం


