శివపార్వతుల కల్యాణం
యాదగిరిగుట్ట : యాదగిరి క్షేత్రానికి అనుబంధంగా ఉన్న పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం ఆలయంలో నిత్య హవనం, శివపంచాక్షరీ జపం, నందీశ్వర పారాయణం, పంచ సూక్త పఠనం చేశారు. యజ్ఞ బ్రహ్మ ఆధ్వర్యంలో రుద్ర హవనం జరిపించారు. సాయంత్రం స్తోత్ర, వేద, నమక, చమక పారాయణములు, మంత్ర పుష్ప పఠనం నిర్వహించారు. మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా కల్యాణ మండపంలో రాత్రి 8గంటలకు శ్రీపర్వత వర్ధిని రామలింగేశ్వరుడి కల్యాణ మహోత్సవం నిర్వహించారు. మహా శివరాత్రిని పురస్కరించుకొని ఆదివారం పర్వత వర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయంలో అభిషేకం నిర్వహించనున్నారు.


