నీలగిరి కార్పొరేషన్ సహా.. 16 మున్సిపాలిటీలు హస్తగతం
నల్లగొండ కార్పొరేషన్
న్యూస్‌రీల్
ఫ కబడ్డీ.. కబడ్డీ
ప్రత్యేక అలంకారంలో రేణుకా ఎల్లమ్మ
శనివారం శ్రీ 14 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
16న సీఎం కప్ జిల్లాస్థాయి చెస్ పోటీలు
నల్లగొండ టూటౌన్ : సీఎం కప్ జిల్లా స్థాయి చెస్ పోటీలు ఈ నెల 16న నల్లగొండలోని ఇండోర్ స్టేడియంలో బాల, బాలికలకు వేర్వేరుగా నిర్వహించనున్నట్లు జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి కొసనం కరుణాకర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు బాలురు 568, బాలికలు 207 మంది పేర్లు నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఈ నెల 16న ఉదయం 8.30 గంటలకు సీఎం కప్ రిజిస్ట్రేషన్ ఫారం, ఆధార్ కార్డు, సొంత చెస్ సెట్‌తో హాజరు కావాలని సూచించారు. క్రీడాకారులకు ఉచిత భోజన వసతి ఉంటుందని, ఆలస్యంగా వచ్చే క్రీడాకారులను అనుమతించమని తెలిపారు. సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీలు ఈ నెల 20, 21 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహిస్తారని వెల్లడించారు.
16వ తేదీ నుంచి ప్రజావాణి
నల్లగొండ : మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగిసినందున ఈ నెల 16వ తేదీ నుంచి ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తామని కలెక్టర్ చంద్రశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాధితులు సోమవారం ప్రజావాణికి హాజరై వా రి ఫిర్యాదులు అందజేయవచ్చని పేర్కొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి పనితీరుకు ప్రజలు పట్టం
నల్లగొండ : సీఎం రేవంత్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలకు జనామోదం లభించిందని డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ ఫలితాలపై తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజాపాలనలో అమలు అవుతున్న సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలు కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి దోహదపడ్డాయన్నారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో 2029లో జరిగే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు అడ్డుకున్న బీజేపీ, బీఆర్‌ఎస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. సమావేశంలో జిల్లాపెల్లి పరమేష్, ఎండీ.ముంతాజ్ అలీ, రాంబాబు నాయుడు, చింతమల్ల వెంకటయ్య, రేవిందర్‌రెడ్డి, పగిళ్ల రాజు, గౌతమ్ పాల్గొనారు.
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
చిట్యాల: చిట్యాల–రామన్నపేట రైల్వే మార్గంలో గురువారం రాత్రి రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు నల్లగొండ రైల్వే ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. లోకో పైలెట్ గుర్తించి నల్లగొండ రైల్వే పోలీసులకు సమాచారం అందించినట్లు రైల్వే ఎస్‌ఐ వివరించారు. మృతుడి వయస్సు 40 ఏళ్లు ఉంటాయని, బూడిద రంగు షర్ట్, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు. నల్లగొండ రైల్వే స్టేషన్ మాస్టర్ అభినవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రైల్వే ఎస్‌ఐ తెలిపారు.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. శుక్రవారం వెలువడిని మున్సిపల్ ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలోని నీలగిరి కార్పొరేషన్‌తో పాటు 16 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కేవలం తిరుమలగిరి మున్సిపాలిటీలకే బీఆర్‌ఎస్ పరిమితమైంది. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఈ నెల 16వ తేదీన పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. నల్లగొండ కార్పొరేషన్‌గా ఏర్పడిన మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభ్యర్థుల విజయానికి విస్తృత ప్రచారం నిర్వహించారు. మేయర్ అభ్యర్థిగా బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డిని పేరును మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో ఆయన అనుకున్నన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవకపోయినా మేయర్ స్థానానికి కావాల్సిన మేజిక్ ఫిగర్‌ను కాంగ్రెస్ దాటింది. నల్లగొండ మొదటి మేయర్‌గా బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి ఎన్నిక లాంఛనం కానుంది.
ప్రత్యేక ప్రణాళికతో మంత్రి ఉత్తమ్..
సూర్యాపేట జిల్లాలోని మున్సిపాలిటీల్లో రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్ని తానై కాంగ్రెస్ విజయానికి కృషి చేశారు. కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించేలా ప్రత్యేక ప్రణాళికతో వ్యవహరించారు. అభ్యర్థుల ఎంపిక నుంచి తగు జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా రెబల్స్‌ను బుజ్జగించడానికి ఆయనే స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి మాట్లాడారు. గట్టి పోటీ ఉన్నవార్డుల్లో మంత్రి స్వయంగా ప్రచారం చేశారు. దీంతో ఆ మూడు మున్సిపాలిటీల్లో అనుకున్న పలితాలను సాధించారు. సూర్యాపేట మున్సిపాలిటీలోనూ నేతలతో సమన్వయంతో వ్యవహరించారు.
మాజీ మంత్రి
జగదీశ్‌రెడ్డికి చుక్కెదురు
సూర్యాపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి వ్యూహం ఫలించలేదు. ఆయన బీఆర్‌ఎస్ అభ్యర్థుల ఎంపిక నుంచి పోలింగ్ వరకు అన్నీ తానై వ్యవహరించారు. సూర్యాపేట మున్సిపాలిటీ పీఠాన్ని కై వసం చేసుకోవాలని శతవిధాలా ప్రయత్నించారు. పోలింగ్ పూర్తయిన వెంటనే మున్సిపాలిటీలో అధిక స్థానాలు వస్తాయని ధీమాతో ముందస్తుగా తమ అభ్యర్థులను క్యాంపునకు తరలించారు. ఫలితాలు మాత్రం తలకిందులయ్యాయి.
ఎక్కడ దెబ్బతిన్నాం..
మున్సిపల్ ఎన్నికల్లో ఆయా పార్టీల అంచనాలు తలకిందులు అయ్యాయి. తాము గెలుస్తామనుకున్న డివిజన్లు, వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. ముఖ్యంగా బీఆర్‌ఎస్ నాయకులు పోల్ మేనేజ్‌మెంట్ విషయంలోనే తీవ్రంగా దెబ్బతిన్నామన్న అంచనాకు వచ్చారు. నల్లగొండ కార్పొరేషన్‌తోపాటు సూర్యాపేట, మిర్యాలగూడ భువనగిరి వంటి మున్సిపాలిటీల్లో తాము తీవ్రంగా నష్టపోవడానికి గల కారణాలను అంచనా వేసుకుంటున్నారు. అయితే.. నల్లగొండ కార్పొరేషన్‌లో అత్యధిక స్థానాలు గెలుపొందినా.. కాంగ్రెస్ పార్టీకి కూడా అనుకున్న స్థానాలు లభించలేదు. 32 స్థానాలకు పైగా గెలుస్తామన్న ధీమాలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నా.. 27 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సీట్లు దక్కనివారు ఏఐఎఫ్‌బీ నుంచి నలుగురు, స్వతంత్రులుగా ఇద్దరు గెలుపొందారు. ప్రచారంలో అలాంటి వారిని పట్టించుకోకపోవడం కూడా తమకు మైనస్ అయిందనే భావనలో ఉన్నారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 28 మంది స్వతంత్రులు, ఐదుగురు ఏఐఎఫ్‌బీ నుంచి విజయగం సాధించడం గమనార్హం.
నల్లగొండ టూటౌన్ : నీలగిరి కార్పొరేషన్‌గా ఏర్పడిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. 27 డివిజన్లలో గెలుపొంది కార్పొరేషన్‌లో హస్తం పార్టీ సత్తా చాటింది. మొత్తం 48 డివిజన్లకు గాను కాంగ్రెస్ 27, బీఆర్‌ఎస్ 9, బీజేపీ 4, ఏఐఎఫ్‌బీ 4, ఎంఐఎం 2, స్వతంత్రులు 2 రెండు చొప్పున గెలుచుకున్నాయి. ముందు నుంచి నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు గెలుచుకుంటుందని అందరూ భావించిన విషయం తెలిసిందే. 48 డివిజన్లు ఉండగా మేయర్ కై వసం చేసుకోవాలంటే 25 స్థానాలు గెలవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ సొంతంగా 27 స్థానాల్లో గెలవడంతో ఏ పార్టీ అవసరం లేకుండానే మేయర్, డిప్యూటి మేయర్ పదవులను కాంగ్రెస్ కై వసం చేసుకోనుంది.
బీఆర్‌ఎస్, బీజేపీకి గతం కంటే తగ్గిన స్థానాలు
నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందాలని భావించిన బీఆర్‌ఎస్, బీజేపీ సింగిల్ డిజిట్‌కు పరిమితం అయ్యాయి. బీఆర్‌ఎస్ పార్టీ కేవలం 9 స్థానాల్లో మాత్రమే గెలిచింది. బీజేపీ 4 స్థానాలతో సరిపెట్టుకుంది. గతంలో బీఆర్‌ఎస్ 20 స్థానాల్లో గెలవగా, ఇప్పుడు 9 స్థానాలకు పరిమితమై 11 స్థానాలు కోల్పోయింది. బీజేపీ గతంలో 6 స్థానాలు గెలుపొందగా నాలుగు స్థానాల్లో గెలిచి రెండు స్థానాలు కోల్పోయింది. గతంలో కాంగ్రెస్ పార్టీ 20 స్థానాలు గెలవగా ఇప్పుడు అదనంగా 7 స్థానాలు పెంచుకొని 27 స్థానాల్లో పట్టు సాధించింది.
కాంగ్రెస్ అభ్యర్థులకు భారీ మెజార్టీ
నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీ సాధించారు. 21వ డివిజన్‌లో ఇబ్రహీం సమీప బీఆర్‌ఎస్ అభ్యర్థిపై 1,381 భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. 38వ డివిజన్ నుంచి బోయినపల్లి వేదశ్రీ 1,163 ఓట్ల మెజార్టీ సాధించి సత్తా చాటారు. ఈ రెండు డివిజన్లలో బీఆర్‌ఎస్ పార్టీ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది.
నీలగిరిపై కాంగ్రెస్ జెండా
ఫ 27 డివిజన్లలో గెలిచిన హస్తం పార్టీ
ఫ సింగిల్ డిజిట్‌కు పరిమితమైన బీఆర్‌ఎస్, బీజేపీ
మండలంలోని ఊట్కూరు గ్రామంలోని సర్వే నంబర్ 451లో తవ్వకాలు చేపడుతున్నారని స్థానికుల నుంచి ఫిర్యాదు వచ్చింది. వెంటనే రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ను పంపి, విచారణకు ఆదేశించాం. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు.
– కృష్ణయ్య, తహసీల్దార్
నిడమనూరు : ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉండటంతో.. ఇదే అదునుగా భావించిన మరో ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నించారు. నిడమనూరు మండలంలోని ఊట్కూరులో సర్వేనంబర్ 451లో ఓ ప్రభుత్వ ఉద్యోగి కుటుంబ సభ్యుల పేరు మీద భూమి ఉంది. దాని పక్కనే పలుగు (ప్రభుత్వ భూమి ఏనెకర్ర) ఉంది. ఆ భూమిని అక్రమించేందుకు మట్టి అమ్మకందారులతో కలిసి వారం రోజులుగా ఆ పలుగును తవ్వుతున్నారు. విషయాన్ని స్థానికులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. నిడమనూరు తహసీల్దార్ జంగాల కృష్ణయ్య.. వెంటనే విచారించాలని ఆర్‌ఐని ఆదేశించారు. ఆర్‌ఐ ఈశ్వర్ అది ప్రభుత్వ భూమి అని చెప్పడంతో, చేసేదేమీ లేక మట్టి తవ్వుతున్న జేసీబీ, టిప్పర్లను తీసుకొని మట్టి వ్యాపారులు వెళ్లిపోయారు.
దాడులు చేస్తున్నా ఆగని దందా..
నిడమనూరు మండలంలో గతంలోనూ మట్టి అమ్మకం దారులు మట్టి తవ్వకాలు చేపట్టగా.. టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి జేసీబీని, మూడు టిప్పర్లను పట్టుకొని మైనింగ్, రెవెన్యూ శాఖ ద్వారా కేసులు పెట్టించారు. మట్టి తవ్వకం ముఠాలు ఆదివారం, అధికారుల సెలవు దినాల్లో మండలంలోని పలు చోట్ల మట్టి తవ్వకాలు చేపడుతున్నాయి. అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నా ఈ దందా ఆగడం లేదు.
ప్రభుత్వ భూమిని గుర్తించాలంటున్న స్థానికులు
మండలంలోని ఊట్కూరులో ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేస్తోంది. అందుకోసం రైతుల నుంచి భూమి తీసుకుంటోంది. ప్రస్తుతం గ్రామంలోని ప్రభుత్వ భూమిని గుర్తిస్తే.. పాఠశాల కోసం భూమి ఇస్తున్న రైతులకు ఈ ప్రభుత్వ భూమి ఇవ్వొచ్చని స్థానికులు అంటున్నారు.
ఊట్కూరులో సర్వే నంబర్ 451లో
మట్టి తవ్వకాలు
కాపర్ వైరు దొంగల అరెస్ట్
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్ వైరు చోరీచేస్తున్న దొంగలను చివ్వెంల పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
ఫ ముందుండి గెలిపించిన ఇద్దరు మంత్రులు
ఫ ఒకే ఒక్క స్థానాన్ని దక్కించుకున్న బీఆర్‌ఎస్
ఫ సూర్యాపేటలో ఫలించని మాజీ మంత్రి వ్యూహం
ఫ 16న కొలువుదీరనున్న పాలకవర్గాలు
నీలగిరి కార్పొరేషన్ సహా.. 16 మున్సిపాలిటీలు హస్తగతం
నీలగిరి కార్పొరేషన్ సహా.. 16 మున్సిపాలిటీలు హస్తగతం
నీలగిరి కార్పొరేషన్ సహా.. 16 మున్సిపాలిటీలు హస్తగతం
నీలగిరి కార్పొరేషన్ సహా.. 16 మున్సిపాలిటీలు హస్తగతం
నీలగిరి కార్పొరేషన్ సహా.. 16 మున్సిపాలిటీలు హస్తగతం
నీలగిరి కార్పొరేషన్ సహా.. 16 మున్సిపాలిటీలు హస్తగతం
నీలగిరి కార్పొరేషన్ సహా.. 16 మున్సిపాలిటీలు హస్తగతం
నీలగిరి కార్పొరేషన్ సహా.. 16 మున్సిపాలిటీలు హస్తగతం
నీలగిరి కార్పొరేషన్ సహా.. 16 మున్సిపాలిటీలు హస్తగతం
నీలగిరి కార్పొరేషన్ సహా.. 16 మున్సిపాలిటీలు హస్తగతం
నీలగిరి కార్పొరేషన్ సహా.. 16 మున్సిపాలిటీలు హస్తగతం
నీలగిరి కార్పొరేషన్ సహా.. 16 మున్సిపాలిటీలు హస్తగతం
నీలగిరి కార్పొరేషన్ సహా.. 16 మున్సిపాలిటీలు హస్తగతం
నీలగిరి కార్పొరేషన్ సహా.. 16 మున్సిపాలిటీలు హస్తగతం
నీలగిరి కార్పొరేషన్ సహా.. 16 మున్సిపాలిటీలు హస్తగతం


