సుందరీకరణ పనులు పునః ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

సుందరీకరణ పనులు పునః ప్రారంభం

Apr 4 2026 7:25 AM | Updated on Apr 4 2026 7:25 AM

తిప్పర్తి : తిప్పర్తి మండల కేంద్రంలో సుందరీకరణ పనులు ఎట్టకేలకు తిరిగి ప్రారంభమయ్యాయి. రూ.9 కోట్ల చేపట్టనున్న సుందరీకరణ పనులను 2024 సెప్టెంబర్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రారంభించారు. అప్పట్లోనే పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్‌ ఆ తర్వాత నిలిపివేశారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి అదనంగా రూ.5 కోట్లు మంజూరు చేయించడంతో సుందరీకణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. మండల కేంద్రంలో రోడ్ల విస్తరణ, అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ, డివైడర్‌ ఏర్పాటు, సెంట్రల్‌ లైటింగ్‌తో కూడలిలో బాబు జగ్జీవన్‌రామ్‌, డాక్టర్‌ బిఆర్‌అంబేద్కర్‌ కాంస్య విగ్రహాలు, పౌంటేయిన్‌ ఏర్పాటు తదితర పనులు చేపట్టి సుందరంగా మార్చనున్నారు. జగ్జీవన్‌రాం, అంబేద్కర్‌ల కాంస్య విగ్రహాలను ఈనెల 14న అంబేద్కర్‌ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement